రాగి
రసాయన మూలకం / From Wikipedia, the free encyclopedia
రాగి (Copper) ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu (లాటిన్లో రాగిని Cuprum అంటారు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి.[5] రాగిని ఉష్ణ, విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి[6]
రాగి | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Appearance | red-orange metallic luster | ||||||||||||||
Standard atomic weight Ar°(Cu) | |||||||||||||||
రాగి in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 4 | ||||||||||||||
Block | d-block | ||||||||||||||
Electron configuration | [Ar] 3d10 4s1 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 1 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 1357.77 K (1084.62 °C, 1984.32 °F) | ||||||||||||||
Boiling point | 2835 K (2562 °C, 4643 °F) | ||||||||||||||
Density (near r.t.) | 8.96 g/cm3 | ||||||||||||||
when liquid (at m.p.) | 8.02 g/cm3 | ||||||||||||||
Heat of fusion | 13.26 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 300.4 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 24.440 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −2, 0,[3] +1, +2, +3, +4 (a mildly basic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 1.90 | ||||||||||||||
Ionization energies |
| ||||||||||||||
Atomic radius | empirical: 128 pm | ||||||||||||||
Covalent radius | 132±4 pm | ||||||||||||||
Van der Waals radius | 140 pm | ||||||||||||||
Spectral lines of రాగి | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | face-centered cubic (fcc) | ||||||||||||||
Speed of sound thin rod | (annealed) 3810 m/s (at r.t.) | ||||||||||||||
Thermal expansion | 16.5 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
Thermal conductivity | 401 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | 16.78 n Ω⋅m (at 20 °C) | ||||||||||||||
Magnetic ordering | diamagnetic[4] | ||||||||||||||
Young's modulus | 110–128 GPa | ||||||||||||||
Shear modulus | 48 GPa | ||||||||||||||
Bulk modulus | 140 GPa | ||||||||||||||
Poisson ratio | 0.34 | ||||||||||||||
Mohs hardness | 3.0 | ||||||||||||||
Vickers hardness | 369 MPa | ||||||||||||||
Brinell hardness | 35 HB = 874 MPa | ||||||||||||||
CAS Number | 7440-50-8 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Middle Easterns (9000 BC) | ||||||||||||||
Symbol | "Cu": from Latin cuprum | ||||||||||||||
Isotopes of రాగి
| |||||||||||||||
Template:infobox రాగి isotopes does not exist | |||||||||||||||
Category: రాగి
|
రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది.[7] రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
రాగి నీటితో రసాయనిక చర్య జరుపకున్నను, గాలోలోని ఆమ్లజని (ఆక్సిజను) తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపు రంగులో పూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలన లోహాన్ని గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును. రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ, క్రి. శ.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.