పాదరసము
From Wikipedia, the free encyclopedia
పాదరసం ఒక రసాయన మూలకము. దీని సంకేతము Hg, పరమాణు సంఖ్య 80. దీనిని క్విక్ సిల్వర్ అంటారు. దీని లాటిన్ నామము "హైడ్రార్జిరం" (/haɪˈdrɑːrdʒərəm/).[4] . ఇది ఆవర్తన పట్టికలో "డి" బ్లాకుకు చెందిన మూలకం. ఇది సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం. ఇదే పరిస్థితులలో ద్రవరూపంలో ఉండే మూలకం బ్రోమిన్. గది ఉష్ణోగ్రత కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సీజియం, గాలియం, రుబీడియం మూలకాలు ద్రవరూపంలోనికి మారుతాయి.
పాదరసం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Appearance | silvery | ||||||||||||||
Standard atomic weight Ar°(Hg) | |||||||||||||||
పాదరసం in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 6 | ||||||||||||||
Block | d-block | ||||||||||||||
Electron configuration | [Xe] 4f14 5d10 6s2 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 32, 18, 2 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | liquid | ||||||||||||||
Melting point | 234.3210 K (−38.8290 °C, −37.8922 °F) | ||||||||||||||
Boiling point | 629.88 K (356.73 °C, 674.11 °F) | ||||||||||||||
Density (near r.t.) | 13.534 g/cm3 | ||||||||||||||
Triple point | 234.3156 K, 1.65×10−7 kPa | ||||||||||||||
Critical point | 1750 K, 172.00 MPa | ||||||||||||||
Heat of fusion | 2.29 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | 59.11 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | 27.983 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −2 , +1, +2 (a mildly basic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 2.00 | ||||||||||||||
Atomic radius | empirical: 151 pm | ||||||||||||||
Covalent radius | 132±5 pm | ||||||||||||||
Van der Waals radius | 155 pm | ||||||||||||||
Spectral lines of పాదరసం | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | rhombohedral | ||||||||||||||
Speed of sound | (liquid, 20 °C) 1451.4 m/s | ||||||||||||||
Thermal expansion | 60.4 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
Thermal conductivity | 8.30 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | (25 °C) 961n Ω⋅m | ||||||||||||||
Magnetic ordering | diamagnetic[3] | ||||||||||||||
CAS Number | 7439-97-6 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Ancient Chinese and Indians (before 2000 BC) | ||||||||||||||
Symbol | "Hg": from its Latin name hydrargyrum, itself from Greek hydrárgyros, 'water-silver' | ||||||||||||||
Isotopes of పాదరసం
| |||||||||||||||
Template:infobox పాదరసం isotopes does not exist | |||||||||||||||
Category: Mercury (element)
|
పాదరసం ప్రకృతిలో "సిన్నాబార్ (మెర్క్యురిక్ సల్ఫైడ్)" రూపంలో ఖనిజంగా లభ్యమవుతుంది.
పాదరసం ధర్మోమీటర్లు, బారోమీటర్లు, మానోమీటర్లు, స్పైగ్మో మానోమీటర్లు, తేలియాడే కవాటాలు (ఫ్లోట్ వాల్వులు), మెర్క్యురీ స్విచ్లు, మెర్క్యురీ రిలేస్, ఫ్లోర్సెంట్ దీపాలు, యితర పరికరాలలో ఉపయోగిస్తారు. పాదరసం మూలకం విషతుల్యం అయినందున దీనిని ధర్మోమీటర్లు, స్పైగ్మోమానోమీటర్లలో వైద్యరంగంలో వినియోగించడం తగ్గించారు. దీని స్థానంలో ఆల్కహాల్ లేదా గాలిన్స్టన్ తో నింపబడిన గాజు ధర్మోమీటర్లను, ధర్మిస్టర్ లేదా పరారుణ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నారు. అదే విధంగా మెర్క్యురీ స్పైగ్మోమీటర్ల స్థానంలో మెకానికల్ ప్రెజర్ గేజ్, ఎలక్ట్రానికి స్ట్రయిన్ గేజ్ లు వాడుకలోనికి వచ్చాయి. పాదరసాన్ని శాస్త్రీయ పరిశోధనలలో, దంతవైద్యంలో "అమాల్గం" గాను ఉపయోగిస్తున్నారు. పాదరసాన్ని మెర్క్యురీ ప్లోర్సెంట్ దీపాలకు ఉపయోగిస్తారు. పాదరస బాష్పాల నుండి విద్యుత్ ప్రసరించినపుడు తక్కువ తరంగదైర్ఘ్యం గల అతినీలలోహిత కాంతి వెలువడుతుంది. దీని కారణంగా గొట్టం ప్రకాశవంతమై దృగ్గోచర కాంతి ఉత్పత్తి అవుతుంది.
నీటిలోకరిగే పాదరస విషతుల్యాలు (ఉదా: మెర్యురిక్ క్లోరైడ్ లేదా మిథైల్ మెర్క్యురీ), పాదరస భాస్ఫాలను పీల్చడం కారణంగా కారణంగా పాదరస విషమయం అవుతుంది.