విజయశాంతి
సినీ నటి, రాజకీయ నాయకురాలు / From Wikipedia, the free encyclopedia
విజయశాంతి ( జననం: 1966 జూన్ 24 ) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు.[5] ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "విశ్వ నట భారతి" "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్"గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.[6][7][8][9] ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.[10] ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది.[10] 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి.[11] ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది.[6][7] 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.[12][13]
విజయశాంతి | |||
లోక్సభ సభ్యురాలు | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | ఎ. నరేంద్ర | ||
---|---|---|---|
తరువాత | కొత్త ప్రభాకర్ రెడ్డి | ||
నియోజకవర్గం | మెదక్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1966-06-24) 1966 జూన్ 24 (వయసు 57)[1][2] మద్రాస్, తమిళనాడు, భారతదేశం[3] | ||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు | *తల్లి తెలంగాణ పార్టీ (2005-2009 )
| ||
జీవిత భాగస్వామి | మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్ (1988) | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ , భారతదేశం[4] | ||
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు, నిర్మాత |