రంగు
From Wikipedia, the free encyclopedia
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.రంగులు లేదా వర్ణాలు (ఫ్రెంచ్: Couleur, ఇటాలియన్: Colore, జర్మన్: Farbe, స్వీడిష్: Färg, లాటిన్, స్పానిష్, ఆంగ్లం: Color) [1] మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. ప్రకృతిలో సాధారణంగా కనిపించే ఏడు రకాల రంగుల్ని సప్తవర్ణాలు అని పేర్కొంటారు . వివిధ రంగులు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను రెటినాలోని కోన్ కణాలు గుర్తించి, మెదడుకు సమాచారం అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ రంగుల దినోత్సవం నిర్వహించబడుతోంది.[2]
Look up రంగు in Wiktionary, the free dictionary.