గెలీలియో గెలీలి
From Wikipedia, the free encyclopedia
గెలీలియో గెలీల ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.
త్వరిత వాస్తవాలు గెలీలియో గెలీలి, జననం ...
గెలీలియో గెలీలి | |
---|---|
జననం | (1564-02-15)1564 ఫిబ్రవరి 15 [1] పిసా, టుస్కానీ - ఇటలీ[1] |
మరణం | 1642 జనవరి 8(1642-01-08) (వయసు 77)[1] అర్సెట్రీ, టుస్కానీ - ఇటలీ[1] |
నివాసం | Grand Duchy of Tuscany |
రంగములు | ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము |
వృత్తిసంస్థలు | పాడువా యూనివర్శిటీ |
చదువుకున్న సంస్థలు | పిసా యూనివర్శిటీ |
ప్రసిద్ధి | Kinematics టెలీస్కోపు సౌరమండలము |
మూసివేయి
గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.