ఖగోళ శాస్త్రం
ఖగోళానికి సంబంధించిన విజ్ఞానము. / From Wikipedia, the free encyclopedia
ఖగోళ శాస్త్రము (astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి:
- పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy): టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
- సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను కనుక్కోవడము/ అభివృద్ధి చేయడం.
ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, ఔత్సాహిక శాస్త్రజ్ఞులు (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి). లక్షల గేలెక్సీ(నక్షత్ర కూటమి) లతో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.