ఉత్తరార్ధగోళం
భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న భూగోళం / From Wikipedia, the free encyclopedia
భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది.[1]
భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో శీతాకాలం డిసెంబరు ఆయనం (డిసెంబరు 21) నుండి మార్చి విషువత్తు (మార్చి 20) వరకూ ఉంటుంది. వేసవి కాలం జూన్ ఆయనం (జూన్ 21) నుండి సెప్టెంబరు విషువత్తు (సెప్టెంబరు 23) వరకూ ఉంటుంది. కాలెండరు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ మధ్య ఉన్నతేడా వలన ఈ తేదీలు ప్రతీ ఏడాదీ ఒకేలా ఉండక కొద్దిగా మారుతూ ఉంటాయి.
ఉత్తరార్థగోళంలో భూమి 60.7% నీటితో నిండి ఉంటుంది. దక్షిణార్థగోళంలో ఇది 80.9% గా ఉంది. భూమిపై ఉన్న మొత్తం నేలలో 67.3% ఉత్తరార్థగోళంలో ఉంది.[2]