పాము
కాళ్ళు లేకుండా కదిలే జంతువు / From Wikipedia, the free encyclopedia
పాములు లేదా సర్పాలు (ఆంగ్లం: Snakes) పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చేవులు ఉండవు కనీ పాముకు, ఆంతర్ చెవులు ఊంటయి
త్వరిత వాస్తవాలు సర్పాలు కాల విస్తరణ: Cretaceous - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
సర్పాలు కాల విస్తరణ: Cretaceous - Recent | |
---|---|
కొరల్ జాతి పాము | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | శారోప్సిడ |
Order: | స్క్వేమేటా |
Suborder: | సెర్పెన్టిస్ లిన్నేయస్, 1758 |
Superfamilies and Families | |
| |
నీలం: సముద్రపు పాములు, నలుపు: భౌమ పాములు |
మూసివేయి
పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు. ప్రతి సంవత్సరం జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవం జరుపుకుంటారు.[1]