సోమవారం
From Wikipedia, the free encyclopedia
సోమవారము లేదా ఇందువారము (ఆంగ్లం:Monday) (/ˈmʌndeɪ/ ( listen) లేదా /ˈmʌndi/) అనేది వారములో రెండవ రోజు. ఇది ఆదివారమునకు, మంగళవారమునకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు, హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది. ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)", మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్డే (Monenday)" నుండి వచ్చింది. దానిఅర్థము చంద్రుని రోజు. హిందువులు సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.
భారతదేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది.[1] హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారతదేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము. థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".