సెర్బియా
From Wikipedia, the free encyclopedia
సెర్బియా (సెర్బియన్|Србија / స్రబిజా/స్ర్బియా), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా listen (help·info)) [1] మధ్య , ఆగ్నేయ యూరప్‌లో ఉన్న భూపరివేష్టిత దేశం. ఇది సదరన్ పనానియన్ మైదానం బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. ఈదేశానికి బెల్ గ్రేడ్ రాజధానిగా ఉంది.[2] దేశానికి ఉత్తర సరిహద్దులో హంగరీ, తూర్పు సరిహద్దులో రొమేనియా , బల్గేరియా దక్షిణ సరిహద్దులో ఉత్తర మేసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, మాంటెనెగ్రో , పశ్చిమసరిహద్దులో కొసావో , అల్బేనియాకు చెందిన వివాదాస్పద భూభాగం ఉంది. సెర్బియాలో సుమారుగా 7 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు.[3] దీని రాజధాని బెల్గ్రేడ్, పురాతనమైన [2][4] , ఆగ్నేయ ఐరోపాలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది.
Република Србија Republika Srbija రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Only Unity Saves the Serbs" |
||||||
జాతీయగీతం |
||||||
Location of సెర్బియా (orange) on the European continent (white) — [Legend] |
||||||
రాజధాని | బెల్ గ్రేడ్ 44°48′N 20°28′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | సెర్బియన్ | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | హంగేరియన్, స్లోవక్, రుమేనియన్, క్రోషియన్, రష్యన్ 1 అల్బేనియన్ 2 |
|||||
ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాస్వామ్యం | |||||
- | రాష్ట్రపతి | బోరిస్ సాదిక్ | ||||
- | ప్రధానమంత్రి | వోజిస్లోవ్ కోస్తూనికా | ||||
వ్యవస్థాపన | ||||||
- | మొదటి రాజ్యం | 7వ శతాబ్దం | ||||
- | సైబీరియా రాజ్యం | 1217 | ||||
- | en:Serbian Empire/సైబీరియా సామ్రాజ్యం | 1345 | ||||
- | స్వాతంత్ర్యం కోల్పోయింది 3 | 1459 | ||||
- | en:First Serbian Uprising/మొదటి సైబీరియన్ ఉత్థానం (నవీన రాజ్య హోదా) | ఫిబ్రవరి 15, 1804 | ||||
- | డీ ఫాక్టో స్వతంత్రం | 25 మార్చి 1867 | ||||
- | డీ జూర్ | 13 జూలై 1878 | ||||
- | ఏకీకరణ | 25 నవంబరు 1918 | ||||
- | జలాలు (%) | 0.13 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 10,147,398 | ||||
- | 2002 జన గణన | 7,498,0004 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $64 billion (World Bank) (66th) | ||||
- | తలసరి | $7,700 (86th) | ||||
జినీ? (2007) | .24 (low) | |||||
కరెన్సీ | సెర్బియన్ దీనారు (RSD ) |
|||||
కాలాంశం | CET (UTC+1) | |||||
- | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .rs (.yu) | |||||
కాలింగ్ కోడ్ | +381 | |||||
1 All spoken in Vojvodina. 2 Spoken in Kosovo. 3 To the Ottoman Empire and Kingdom of Hungary 4 excluding Kosovo 5 The Euro is used in Kosovo alongside the Dinar. 6 .rs became active in September 2007. Suffix .yu will exist until September 2009. |
6 వ శతాబ్దానికి చెందిన బాల్కంన్స్కు స్లావిక్ వలసల తరువాత మధ్య యుగప్రారంభంలో సెర్బ్స్ అనేక రాజ్యాలను స్థాపించారు. సెర్బియా కింగ్డమ్ 1217 లో రోమ్ , బైజాంటైన్ సామ్రాజ్యాల గుర్తింపు పొందింది. ఇది 1346 లో స్వల్ప-కాలిక సెర్బియన్ సామ్రాజ్యంగా ఉంది. 16 వ శతాబ్దం మధ్యకాలం నాటికి మొత్తం ఆధునిక సెర్బియా ఒట్టోమన్లచే విలీనం చేయబడింది. కొన్నిసార్లు హబ్స్బర్గ్ సామ్రాజ్యం అంతరాయం కలిగించింది. ఇది 17 వ శతాబ్దం చివరి నుండి సెంట్రల్ సెర్బియా (ఆధునిక వొజ్వోడినాలో) వైపు విస్తరించడం ప్రారంభమైంది . 19 వ శతాబ్దం ప్రారంభంలో సెర్బియన్ విప్లవం " ప్రింసిపాలిటీ ఆఫ్ సెర్బియా " మొట్టమొదటి రాజ్యాంగబద్ధ రాజరికం స్థాపించిన తరువాత దాని భూభాగాన్ని విస్తరించింది.[5] 1990 లలో మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన ఘోరమైన మరణాల తరువాత , సెర్బియాతో వోజ్వోడినా (, ఇతర భూభాగాలు) మాజీ హాబ్స్బర్గ్ సింహాసన అనంతర ఐక్యీకరణ యుగోస్లేవ్ వార్స్ వరకు వివిధ రాజకీయ నిర్మాణాలలో ఉనికిలో ఉన్న ఇతర దక్షిణ స్లావిక్ ప్రజలతో యుగోస్లేవియాకు సహ-దేశంగా స్థాపించబడింది. యుగోస్లేవియా విభజనలో సెర్బియా మోంటెనెగ్రోతో ఒక యూనియన్ ఏర్పడింది. 2006 లో సెర్బియా తిరిగి స్వాతంత్ర్యం ప్రారంభించిన సమయంలో యూనియన్ శాంతియుతంగా రద్దు చేయబడింది. 2008 లో కొసావో ప్రావిన్స్ పార్లమెంట్ ఏకపక్షంగా ప్రకటించిన స్వాతంత్ర్యం ప్రకటనకు అంతర్జాతీయ సమాజం నుండి మిశ్రమ ప్రతిస్పందనలు లభించాయి.
సెర్బియా యునైటెడ్ నేషంస్, కౌంసిల్ ఆఫ్ యూరప్, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్, పార్టనర్ షిప్ ఫర్ పీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది బ్లాక్ సీ ఎకనమిక్ కార్పొరేషన్ , సెంట్రల్ యురేపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు సంస్థలలో సభ్యదేశంగా ఉంది.[6] సెర్బియా 2014 జనవరి నుండి యురేపియన్ యూనియన్ ప్రవేశంపై చర్చలు నిర్వహిస్తోంది. దేశం డబల్యూ,టి.ఒ,[7] ఒక సైనిక తటస్థ రాజ్యంగా ఉంది. సెర్బియా ఒక ఉన్నత-మధ్యతరగతి ఆదాయం [8] దేశ ఆర్థికరంగంలో సేవా రంగం ఆధిపత్యం అలాగే పారిశ్రామిక రంగం , వ్యవసాయం ప్రాధాన్యత వహిస్తున్నాయి. మానవ అభివృద్ధి సూచికలో అంతర్జాతీయంగా 66 వ స్థానం [9] సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్‌లో 45 వ స్థానంలో ఉంది.[10] అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో 56 వ స్థానంలో ఉంది.[11]