మొలస్కా
From Wikipedia, the free encyclopedia
మొలస్కా లేదా మలస్కా (లాటిన్ Mollusca) జీవులు " మెత్తటి శరీరం " గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు జంతువులు. ఇవి జంతు ప్రపంచంలో కీటకాల తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు నత్తలు, శంఖాలు, ముత్యపుచిప్పలు, స్క్విడ్ లు, ఆక్టోపస్ లాంటివి. ఇవి 0.5 మి.మీ. నుండి కొన్ని మీటర్లు పొడవుంటాయి. మలస్కా జీవులు కాంబ్రియన్ కాలములో ఆవిర్భవించింది. కర్పరమును కలిగియుండుట ఈ జీవుల ముఖ్యలక్షణము.
మొలస్కా కాల విస్తరణ: Ediacaran or కాంబ్రియన్ - Recent | |
---|---|
Caribbean Reef Squid, Sepioteuthis sepioidea | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | మొలస్కా లిన్నేయస్, 1758 |
తరగతులు | |
Caudofoveata |
మొలస్కస్ అంటే లాటిన్ భాషలో - మెత్తని అని అర్ధం. మలస్కా అను పదమును ఆరిస్టాటిల్ మొట్టమొదటగా ఉపయోగించారు. కాని కువియర్ అనే శాస్త్రవేత్త దీనికి నిర్వచించెను. మలస్కా జీవుల అధ్యయనమును "మాలకాలజీ" అని, కర్పరముల అధ్యయనాన్ని "కాంకాలజీ" అని అంటారు.