బిల్ గేట్స్
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు దాత / From Wikipedia, the free encyclopedia
బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు.[2]
ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు శుక్రవారం (2008 జూన్ 28) బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు. చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్లను కనుగొనే సంష్టలకు నిధులు సమకూర్చటం తన వంతు సహాయం చేసే కార్యకలాపాల మీద దృష్టి పెట్టబోవుచున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు.[3]
మూడవ విలియం హెన్రీ గేట్స్ | |
బిల్ గేట్స్ | |
జననం | (1955-10-28) 1955 అక్టోబరు 28 (వయసు 68) సియెటల్, వాషింగ్టన్, అమెరికా |
---|---|
వృత్తి | చైర్మెన్, మైక్రోసాఫ్ట్ కో-చైర్మెన్, బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ |
ఉన్న డబ్బు | US$110 బిలియన్లు (2023)[1] |
భార్య | మెలిండా గేట్స్ (1994 నుండి ప్రస్తుతం) |
సంతానం | ముగ్గురు |
వెబ్సైటు | మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ పేజి బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ |