నైజీరియా
From Wikipedia, the free encyclopedia
నైజీరియా (ఆంగ్లం : Nigeria) అధికారిక నామం, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఇది పశ్చిమ ఆఫ్రికాలో యున్నది. దీని పశ్చిమసరిహద్దులో బెనిన్, తూర్పుసరిహద్దులో చాద్ - కామెరూన్, ఉత్తరసరిహద్దులో నైగర్ ఉన్నాయి. దీని రాజధాని అబ్యూజా .
రిపబ్లిక్ నైజీరియా Republic ndi Naigeria Republik Federaal bu Niiseriya Orílẹ̀-èdè Olómìnira Àpapọ̀ Naìjírìà جمهورية نيجيريا ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Unity and Faith, Peace and Progress" |
||||||
జాతీయగీతం "Arise, O Compatriots" |
||||||
రాజధాని | en:Abuja | |||||
అతి పెద్ద నగరం | en:Lagos | |||||
అధికార భాషలు | ఆంగ్లం | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Hausa, Igbo, Yoruba, en:Languages of Nigeria | |||||
ప్రజానామము | Nigerian | |||||
ప్రభుత్వం | Presidential Federal republic | |||||
- | President | Muhammadu Buhari (APC) | ||||
- | Vice President | Yemi Osinbajo ( - ) | ||||
- | Senate President | en:David Mark (PDP) | ||||
- | Speaker of the House | Dimeji Bankole (PDP) | ||||
- | Chief Justice | en:Idris Kutigi | ||||
Unification of Southern and Northern Nigeria | ||||||
- | by en:Frederick Lugard | 1914 | ||||
- | Republic declared | October 1, 1963 | ||||
- | జలాలు (%) | 1.4 | ||||
జనాభా | ||||||
- | 2007 United Nation అంచనా | 148,000,000[1] (8th) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $291.709 billion[2] (38th²) | ||||
- | తలసరి | $2,027[2] (137th²) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $166.985 billion[2] (41st) | ||||
- | తలసరి | $1,160[2] (126th) | ||||
జినీ? (2003) | 43.7 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.499 (low) (154th) | |||||
కరెన్సీ | Nigerian naira (₦) (NGN ) |
|||||
కాలాంశం | WAT (UTC+1) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ng | |||||
కాలింగ్ కోడ్ | +234 | |||||
1 Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected. ² The GDP estimate is as of 2006; the total and per capita ranks, however, are based on 2005 numbers. |
నైజీరియా సహస్రాబ్ధి కాలంకంటే అధికంగా అనేక పురాతన, స్థానిక రాజ్యాలు, దేశాలపాలనలో ఉంది. ఆధునిక రాజ్యం 19 వ శతాబ్దంలో ప్రారంభించబడిన బ్రిటీషు వలసరాజ్య పాలన నుండి ఉద్భవించింది. 1914 లో దక్షిణ నైజీరియా ప్రొటెక్టరేటు, ఉత్తర నైజీరియా ప్రొటెక్టరేటు లతో కలిసి ప్రస్తుత ప్రాదేశిక ఆకృతి ఏర్పడింది. బ్రిటిషు సంప్రదాయక నాయకులతో పరోక్ష పాలనను ఏర్పాటుచేసిన సమయంలో న్యాయవ్యవస్థ, నిర్వహణా విధాలను బ్రిటిషు ప్రభుత్వం నిరణయించింది. నైజీరియా 1960 లో అధికారికంగా స్వతంత్ర సమాఖ్య అయింది. ఇది 1967 నుండి 1970 వరకు పౌర యుద్ధాన్ని అనుభవించింది. ఇది తరువాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు, సైనిక నియంతృత్వాలకు మధ్య పాలన మారుతూ వచ్చింది. 1999 లో ఇది ఒక స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని సాధించింది. 2011 అధ్యక్ష ఎన్నికలు మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా నిర్వహించబడ్డాయి.[3]
నైజీరియా పెద్ద జనాభా, ఆర్థికవ్యవస్థ కారణంగా తరచూ "జైంటు ఆఫ్ ఆఫ్రికా"గా పిలువబడుతుంది.[4] 186 మిలియన్ల మంది నివాసితులతో, నైజీరియా ఆఫ్రికాలో అత్యంత అధిక జనసాంధ్రత కలిగిన దేశంగా ప్రధస్థానంలో ఉంటూ ప్రపంచంలోని 7 వ అత్యంత జనసాంద్రతగల దేశంగా ఉంది. భారతదేశం, చైనాల తరువాత 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు గల 90 మిలియన్ల మంది యువతతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద యువత కలిగిన దేశణ్గా ఉంది.[5][6] ఈ దేశం బహుళజాతి దేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దేశంలో 250 జాతుల సమూహాలు ఉన్నాయి.[7] వీటిలో మూడు అతిపెద్ద జాతులుగా హౌసా, ఇగ్బో, యోరుబాలు ఉన్నాయి. ఈ జాతి సమూహాలకు 250 కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి. అనేక విభిన్న సంస్కృతులు గుర్తించబడ్డాయి.[7][8] అధికారిక భాష ఆంగ్లం. నైజీరియా దక్షిణ భాగంలో క్రైస్తవులు అధికంగా నివసిస్తున్నారు. ముస్లింలు అధికంగా దేశం ఉత్తరప్రాంతంలో నివసిస్తున్నారు. మతపరంగా దేశం ముస్లింనివాసిత ఉత్త్రప్రాంతం, క్రైస్తవులు నివసిస్తున్న దక్షిణప్రాంతంగా రెండుగా విభజించబడింది. అల్పసంఖ్యాక ప్రజలు (ఇగ్బో, యొరోవా జాతులకి చెందినవారు) నైజీరియాకు చెందిన స్థానిక మతాలను ఆచరిస్తున్నారు.
2015 నాటికి నైజీరియా ప్రపంచంలో 20 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారింది. 500 బిలియన్ల డాలర్లు, నామమాత్ర జి.డి.పి. కొనుగోలు శక్తి తుల్యత వరుసగా $ 1 ట్రిలియను. ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2014 లో దక్షిణాఫ్రికాను అధిగమించింది.[9][10] రుణాలు, జి.డి.పి.లో ఋణాల శాతం 11%.[11] నైజీరియాను ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్టుగా పరిగణిస్తుంది. [12] ఇది ఆఫ్రికా ఖండంలో ప్రాంతీయ శక్తిగా గుర్తించబడింది.[13][14][15] అంతర్జాతీయ వ్యవహారాలలో మధ్యశక్తిగా ఉంది.[16][17][18][19] ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా గుర్తించబడింది.[20][21][22] అయినప్పటికీ ఇది ప్రస్తుతం "తక్కువ" హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సుతో ప్రపంచంలో 152 వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని ఎం.ఐ.ఎన్.టి. సమూహంలో నైజీరియా సభ్యదేశంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తదుపరి "బి.ఆర్.ఐ.సి. లాంటి" ఆర్థిక వ్యవస్థగా చూడబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన "నెక్స్టు ఎలెవెన్" ఆర్థికవ్యవస్థల జాబితాలో చేర్చబడింది. నైజీరియా ఆఫ్రికా సమాఖ్య స్థాపక సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి, కామన్వెల్తు ఆఫ్ నేషంసు, ఒ.పి.ఇ.సి. వంటి ఇతర అంతర్జాతీయ సంస్థల సభ్యదేశంగా ఉంది.