థాయిలాండ్
From Wikipedia, the free encyclopedia
థాయిలాండ్ లేదా థాయ్‌లాండ్ (English: Thailand నించి, Thai: ประเทศ, translit. ప్రాటెట్ థాయ్ "ప్రదేశ థాయి"), అధికారికంగా థాయి రాజ్యం (ราชอาณาจักรไทย రచ్చ అన్న చక్ర థాయ్ "రాజా ఆజ్ఞ చక్ర థాయి"; Kingdom of Thailand కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్), ఒక ఆగ్నేయ ఆసియా దేశము. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
థాయి రాజ్యం ราชอาณาจักรไทย Ratcha Anachak Thai | |
---|---|
నినాదం: ชาติ ศาสนา พระมหากษัตริย์ (Thai) Chat Satsana Phramahakasat "Nation, Religion, King" (unofficial) | |
రాజధాని | en:Bangkok |
అధికార భాషలు | Thai[1] |
Official script | Thai alphabet |
జాతులు |
|
పిలుచువిధం | Thai |
ప్రభుత్వం | Unitary parliamentary en:constitutional monarchy |
• King | en:Bhumibol Adulyadej (en:Rama IX) |
Prayut Chan-o-cha (NC) | |
శాసనవ్యవస్థ | National Assembly |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | House of Representatives |
Formation | |
1238–1448 | |
1351–1767 | |
1768–1782 | |
6 April 1782 | |
• Constitutional monarchy | 24 June 1932 |
విస్తీర్ణం | |
• మొత్తం | 513,120 km2 (198,120 sq mi) (51st) |
• నీరు (%) | 0.4 (2,230 km2) |
జనాభా | |
• 2011 estimate | 66,720,153[3] (20వ) |
• 2010 census | 65,479,453[4] |
• జనసాంద్రత | 132.1/km2 (342.1/sq mi) (88th) |
GDP (PPP) | 2013 estimate |
• Total | $701.554 billion[5] |
• Per capita | $10,849[5] |
GDP (nominal) | 2013 estimate |
• Total | $424.985 billion[5] |
• Per capita | $6,572[5] |
జినీ (2010) | 39.4[6] medium |
హెచ్‌డిఐ | 0.690[7] medium · 103వ |
ద్రవ్యం | బహ్ట్ (฿) (THB) |
కాల విభాగం | UTC+7 |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +66 |
Internet TLD |
|
థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద, రాజధాని నగరం బాంకాక్. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు, 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు, వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985, 1996లో అతివేగంగా ఆర్థికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.