అజర్బైజాన్
From Wikipedia, the free encyclopedia
అజర్బైజాన్ (ఆంగ్లం : Azerbaijan) అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అతి పెద్ద దేశం అలాగే అత్యధిక జనాభాగల దేశం. ఇది పాక్షికంగా తూర్పు ఐరోపా లోనూ, పాక్షికంగా పశ్చిమ ఆసియా లోనూ ఉంది. [3] దీని సరిహద్దులు తూర్పున కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇరాన్, పశ్చిమాన ఆర్మేనియా, వాయువ్యాన జార్జియా, ఉత్తరాన రష్యా. ఈ దేశానికి చెందిన అనేక దీవులు కాస్పియన్ సముద్రంలో గలవు. అజర్బైజాన్ లోని నఖ్చివన్ అటానిమస్ రిపబ్లిక్ ఎక్స్క్లేవ్ ఉత్తర, తూర్పు దిశలలో ఆర్మేనియా, దక్షిణ, పశ్చిమంలో ఇరాన్ పరివృతమై ఉంటాయి. వాయవ్యంలో అతిస్వల్పంగా టర్కీ సరిహద్దు ఉంటుంది.
Azərbaycan Respublikası రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం Bir kərə yüksələn bayraq, bir daha enməz! The flag once raised will never fall! |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | బాకు (నగరం) 40°22′N 49°53′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | అజర్బైజాని | |||||
ప్రజానామము | అజర్బైజానీ | |||||
ప్రభుత్వం | గణతంత్రం | |||||
- | రాష్ట్రపతి | ఇల్హామ్ అలియేవ్ | ||||
- | ప్రధానమంత్రి | అర్తూర్ రసీజాదే | ||||
స్వతంత్రం | సోవియట్ యూనియన్ నుండి | |||||
- | ప్రకటించుకున్నది | ఆగస్టు 30 1991 | ||||
- | సంపూర్ణమైనది | డిసెంబరు 25 1991 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 86,600 కి.మీ² (114వ) 33,436 చ.మై |
||||
- | జలాలు (%) | 1,6% | ||||
జనాభా | ||||||
- | ఏప్రిల్, 2011 అంచనా | 9,165,000[1] (92వ) | ||||
- | జన సాంద్రత | 106 /కి.మీ² (89వ) 274 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2011 అంచనా | |||||
- | మొత్తం | $94.318 బిలియన్లు[2] (86వ) | ||||
- | తలసరి | $10,340[2] (97వ) | ||||
జినీ? (2001) | 36.5 (54వ) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.736 (medium) (99వ) | |||||
కరెన్సీ | మనాత్ (AZN ) |
|||||
కాలాంశం | (UTC+4) | |||||
- | వేసవి (DST) | (UTC+5) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .az | |||||
కాలింగ్ కోడ్ | +994 |
1918లో అజర్బైజాన్ రిపబ్లిక్ స్వతంత్రం ప్రకటించి మొదటి ముస్లిం ఆధిక్యత కలిగిన లౌకిక రాజ్యంగా అవతరించింది. [4] ఒపేరాలు, దియేటర్లు, అధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాలలో అజర్బైజాన్ ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఈజిప్ట్ ఉంది.[5] 1920లో అజర్బైజాన్ సోవియట్ యూనియన్లో విలీనం చేయబడింది.[6][7] సోవియట్ యూనియన్ పతనం కావడానికి ముందు అజర్బైజాన్ 1991 ఆగస్టు 31న స్వతంత్రం ప్రకటించింది.[8] 1991 సెప్టెంబరులో ఆర్మేనియన్లు ఆధిక్యత కలిగిన " నగొర్నొ- కారాబాఖ్ " ప్రత్యేక దేశం (నగొర్నొ- కారాబాఖ్ రిపబ్లిక్) కావాలని వత్తిడి చేసింది.[9] 1991 లో నగొర్నొ- కారాబాఖ్ యుద్ధం వరకు ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉంది. ఒ.ఎస్.చి.ఈ మధ్యవర్తిత్వం వహించి చివరి తీర్మానం చేసేవరకు ఇది అంతర్జాతీయంగా అజర్బైజాన్ ప్రాంతంగానే గుర్తించబడింది.[10][11][12][13] అజర్బైజాన్ " యూనిటరీ కంస్టిట్యూషనల్ రిపబ్లిక్ " విధానం కలిగి ఉంది. అజర్బైజాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ ", ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆపరేషన్ ఇన్ ఐరోపా " , ది నేటో పార్టనర్షిప్ ఫర్ పీస్ సభ్యత్వం కలిగి ఉంది. టర్కీ భాష వాడుక భాషగా ఉన్న 6 దేశాలలో అజర్బైజాన్ ఒకటి. అజర్బైజాన్ టర్కిక్ కౌంసిల్లో , జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ టర్కిక్ ఆర్ట్ అండ్ కల్చర్ యాక్టివ్ మెంబర్గా ఉంది. అజర్బైజాన్ 158 దేశాలతో దౌత్యసంబంధాలు కలిగి ఉంది. 38 అంతర్జాతీయ ఆర్గనైజేషన్లో సభ్యత్వం కలిగి ఉంది.[14] గి.యు.ఎం. ఆర్గనైజేషన్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎకనమిక్ డెవెలెప్మెంటు, ది కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంటు స్టేట్స్,[15] " ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వీపంస్ " ఫండింగ్ మెంబర్లలో అజర్బైజాన్ ఒకటి. 1992 నుండి ఇది ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉంది. 2006 మే 9న అజర్బైజాన్ కొత్తగా రూపొందించబడిన " హ్యూమన్ రైట్స్ కౌంసిల్ " సభ్యత్వం కొరకు ఎన్నిక చేయబడింది. [16] అలీన ఉద్యమ ఉద్యమంలో అజర్బైజాన్ సభ్యత్వం కలిగి ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణ , ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ కరెస్పాండెంటు అంతస్థు కలిగి ఉంది.[14][17] అజర్బైజాన్ రాజ్యాంగంలో అధికారికమతం ఏదీ ప్రకటించబడలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ లౌకికవాదానికి మద్దతు ఇస్తున్నప్పటికీ అల్పసంఖ్యాక ప్రజలు, కొన్ని ప్రతిపక్ష ఉద్యమాలు సున్నీ ముస్లింను ఆదరిస్తున్నాయి. [18] అజర్బైజాన్ హ్యూమన్ డెవెలెప్మెంటు జాబితాలో ఉన్నత స్థాయిలో ఉంది. ఇది అత్యధిక తూర్పు, ఐరోపా దేశాలకంటే ముందు ఉన్నది.[19] ఇది ఆర్థికాభివృద్ధి , అక్షరాస్యతలో ఉన్నత స్థాయిలో ఉంది. [20][21] అలాగే నిరుద్యోగుల శాతంలో దిగువన ఉంది.[22] అయినప్పటికీ లంచగొండితనం దేశం అంతటా వ్యాపించి ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వ సేవారంగంలో అధికంగా ఉంది.[23][24] అధికార పార్టీ " న్యూ అజర్బైజాన్ పార్టీ " నిరంకుశత్వం , మానహక్కుల ఆరోపణలు ఎదుర్కొంటున్నది.[25][26]