2023 నగోర్నో-కరాబాఖ్ ఘర్షణలు
From Wikipedia, the free encyclopedia
2023 సెప్టెంబరు 19 నుంచి 20 మధ్య, అజర్బైజాన్ తన నుంచి విడిపోయినట్టు ప్రకటించుకున్న రాష్ట్రమైన ఆర్ట్సాఖ్పై సైనిక దాడిని ప్రారంభించింది. అజర్బైజాన్లో భాగంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఆర్మేనియన్లు నివసించే వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాఖ్లో ఈ దాడి జరిగింది.[7][8] రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్సాఖ్పై అజర్బైజాన్ దిగ్బంధం విధించి, తద్వారా ఏర్పడిన తీవ్ర సంక్షోభం మధ్య ఈ దాడులు చేసింది. దీని ఫలితంగా ప్రభావిత ప్రాంతంలో ఆహారం, ఔషధాలు, ఇతర వస్తువుల వంటి ప్రాణావసర వస్తువుల కొరత ఏర్పడింది.[9]
2023 నాగోర్నో-కారాబాఖ్ ఘర్షణలు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
నాగోర్నో-కారాబాఖ్ వివాదంలో భాగము | |||||||||
2020లో నాగోర్నో-కారాబాఖ్లో సైనిక పరిస్థితి రెండవ నాగోర్నో-కారాబాఖ్ యుద్ధంలో అజర్బైజాన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశాలు 2020 నాగోర్నో-కారాబాఖ్ యుద్ధవిరమణ ఒప్పందంలో భాగంగా అజర్బైజాన్కి అప్పగించిన ప్రదేశాలు వివాదం ప్రారంభంలో నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంలో ఆర్ట్సాఖ్ అధీనంలో ఉన్న ప్రదేశాలు రష్యన్ శాంతిదళాలు కాపలాలోని లకెన్ కారిడార్, దాడివాంక్ మఠం | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
Azerbaijan | మూస:Country data Artsakh | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
|
| ||||||||
పాల్గొన్న దళాలు | |||||||||
| మూస:Country data Republic of Artsakh | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
తెలియదు | Per Artsakh:[4]
| ||||||||
అజర్బైజాన్ ప్రకారం:[5][6] 1 అజార్బైజానీ పౌరుని మృతి 1 అజార్బైజానీ పౌరునికి గాయాలు Per Artsakh:[4] 10 మంది అర్మేనియన్ పౌరుల మృతి 40 మంది అర్మేనియన్ సైనికులకు గాయాలు |
సెప్టెంబర్ 20న అంటే దాడి ప్రారంభించిన ఒక రోజు తర్వాత నాగోర్నో-కరాబాఖ్లోని రష్యా శాంతి దళం మధ్యవర్తిత్వంతో నాగోర్నో-కరాబాఖ్లో ఘర్షణలు పూర్తిగా నిలిపివేసే ఒప్పందం కుదిరినట్లు నాగోర్నో-కరాబాఖ్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.[10] సెప్టెంబరు 21న అజర్బైజాన్ యెవ్లాఖ్ నగరంలో ఆర్ట్సాఖ్ అర్మేనియన్ కమ్యూనిటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాతి నెల తదుపరి సమావేశం నిర్వహించనున్నట్టు నిర్ణయించారు.[11][12]