2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఏడవ ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్. టీ20 ప్రపంచ కప్ మ్యాచులు 2021 అక్టోబరు 17 నుంచి 2021 నవంబరు 14 వరకు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా యూఏఈకి మార్చారు. ఈ ప్రపంచ కప్‌లో 16 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబరు 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం భారత్ లో రాత్రి 7:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతాయి.
త్వరిత వాస్తవాలు తేదీలు, నిర్వాహకులు ...
2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ | |
---|---|
తేదీలు | 17 అక్టోబర్ 2021 – 14 నవంబర్ 2021 |
నిర్వాహకులు | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | టీ20 ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | గ్రూప్ స్టేజి & నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | India(భారతదేశం) UAE(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) Oman(ఒమన్) |
పాల్గొన్నవారు | 16[1] |
ఆడిన మ్యాచ్‌లు | 45[2] |
అధికారిక వెబ్సైటు | t20worldcup.com |
← 2016 2022 → |
మూసివేయి