ర్యాన్ టెన్ డోషేట్
From Wikipedia, the free encyclopedia
ర్యాన్ నీల్ టెన్ డోషేట్ (జననం 30 జూన్ 1980) మాజీ డచ్ - దక్షిణాఫ్రికా క్రికెటరు. అతను నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టు తరపున వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ (టి20ఐ) ఆడాడు.[2] టెన్ డోషేట్ 2008 - 2010, 2011లో రికార్డు స్థాయిలో మూడు సార్లు ఐసీసీ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ర్యాన్ నీల్ టెన్ డోషేట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1980-06-30) 1980 జూన్ 30 (వయసు 43) పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Tendo[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 ft 11 in (1.80 m) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 30) | 2006 జూలై 4 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2011 మార్చి 18 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 27 (previously 22) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 10) | 2008 ఆగస్టు 2 - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 అక్టోబరు 20 - Namibia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 27 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003–2021[lower-alpha 1] | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–2011/12 | Mashonaland Eagles | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | కాంటర్బరీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | టాస్మానియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2015 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–2014/15 | ఒటాగో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Chittagong Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15 | అడిలైడ్ స్ట్రైకర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Dhaka Dynamites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Comilla విక్టోరియాns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Rajshahi Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | నెల్సన్ మండేలా బే జయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2022 సెప్టెంబరు 21 |
దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన టెన్ డోషేట్, 2003 ఇంగ్లీష్ సీజన్ కోసం ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు డచ్ పౌరసత్వం ఉండడం చేత దేశీయ ఆటగాడిగా ఈ అర్హత సాధించాడు. కుడిచేతి వాటం ఆల్ రౌండరైన టెన్ డోషేట్, మొదట 2005 ICC ట్రోఫీలో డచ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2009 ప్రపంచ ట్వంటీ20, 2011 ప్రపంచ కప్‌తో సహా అనేక టోర్నమెంట్లను ఆడాడు. ఈ రెండో టోర్నమెంటులో, ఇంగ్లండ్‌పై 119 పరుగులు చేశాడు, ICC పూర్తిస్థాయి సభ్యదేశంపై డచ్ ఆటగాడు చేసిన మొదటి వన్డే సెంచరీ అది.
దేశీయ స్థాయిలో, 2006 సీజన్లో టెన్ డోషేట్ మొదటిసారిగా ఎసెక్స్కు రెగ్యులర్‌గా స్థిరపడ్డాడు. 2014 సీజన్‌కు జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను ఆస్ట్రేలియా బిగ్ బాష్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో ఫ్రాంచైజీలతో సహా ఇతర దేశాలలో అనేక ప్రొఫెషనల్ ట్వంటీ20 జట్ల కోసం ఆడాడు.
2021 సెప్టెంబరులో టెన్ డోషేట్, 2021 చివరిలో ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతానని ప్రకటించాడు. [3] అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్ సందర్భంగా 2021 అక్టోబరు 20 న నమీబియాతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2021 డిసెంబరులో అతను కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2022 నవంబరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [4]