ఫరీదాబాద్
హర్యానా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
ఫరీదాబాద్ హర్యానాలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. భారత రాజధాని న్యూ ఢిల్లీ సరిహద్దుల్లో, జాతీయ రాజధాని ప్రాంతంలో ఉంది. ఢిల్లీకి చెందిన ప్రధాన ఉపగ్రహ నగరాల్లో ఇదొకటి. రాష్ట్ర రాజధాని చండీగఢ్‌కు దక్షిణంగా 284 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పున జిల్లా సరిహద్దుగా యమునా నది ఉంది. 2016 మే 24 న భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ రెండవ జాబితాలో నగరాన్ని చేర్చింది. [2] సిటీ మేయర్స్ ఫౌండేషన్ చేసిన సర్వే ఫరీదాబాద్ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎనిమిదవ నగరంగా, భారతదేశంలో మూడవదిగా పేర్కొంది. [3] 2001 ఢిల్లీ ప్రాంతీయ ప్రణాళిక ప్రకారం ఫరీదాబాద్, ఢిల్లీ మెట్రోపాలిటన్ ఏరియా (డిఎంఎ) లో భాగం. [4]
ఫరీదాబాద్ | ||||||
---|---|---|---|---|---|---|
మెట్రో | ||||||
పైనుండి, ఎడమ నుండి కుడికి: వాటికా మైండ్స్కేప్స్, సూరజ్‌కుండ్ వద్ద ఉన్న సరస్సు, ఫరీదాబాద్ క్రౌన్ ప్లాజా, లార్సెన్ అండ్ టూబ్రో కార్పొరేట్ ఆఫీసు | ||||||
Coordinates: 28.4211°N 77.3078°E / 28.4211; 77.3078 | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | హర్యాణా | |||||
జిల్లా | ఫరీదాబాద్ | |||||
మెట్రోపాలిటన్ ప్రాంతం | ఢిల్లీ | |||||
స్థాపన | 1607 | |||||
Named for | షేక్ ఫరీద్ | |||||
Area | ||||||
• Total | 742.9 km2 (286.8 sq mi) | |||||
Elevation | 198 మీ (650 అ.) | |||||
Population (2011) | ||||||
• Total | 14,04,653[1] | |||||
• Density | 1,890.7/km2 (4,897/sq mi) | |||||
Demonym | ఫరీదాబాదీ | |||||
భాషలు | ||||||
• అధికారిక | హిందీ, పంజాబీ | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
టెలిఫోన్ కోడ్ | 0129 | |||||
Vehicle registration | HR-51 (North) HR-29 (South) HR-87 (West) HR-38 (Commercial) DL-16 (Delhi NCR) | |||||
Website |
ఆగ్రా కాలువకూ యమునా నదికీ మధ్య కొత్తగా అభివృద్ధి చెందిన నివాస, పారిశ్రామిక ప్రాంతాన్ని (సెక్టరు 66 నుండి 89 వరకు) గ్రేటర్ ఫరీదాబాద్ అని పిలుస్తారు. వెడల్పైన రహదారులు, ఎత్తైన భవనాలు, మాళ్ళు, విద్యాసంస్థలు, ఆరోగ్య, వాణిజ్య కేంద్రాలతో ఈ ప్రాంతం స్వయం సమృద్ధ ఉప నగరంగా అభివృద్ధి చెందుతోంది. 66 నుంచి 74 వరకూ ఉన్న సెక్టర్లు పారిశ్రామిక ప్రాంతం కాగా, 75 నుంచి 89 వరకు నివాస ప్రాంతం. [5]
ఫరీదాబాద్ హర్యానా లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రం. హర్యానాలో వసూలు చేసిన ఆదాయపు పన్నులో 50% ఫరీదాబాద్, గుర్గావ్ ల నుండే వస్తుంది. [6] ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు, స్విచ్ గేర్లు, రిఫ్రిజిరేటర్లు, బూట్లు, టైర్లు, వస్త్రాలు దాని ముఖ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల్లో కొన్ని. వ్యవసాయ రంగంలో గోరింట ఉత్పత్తికి ఫరీదాబాద్ ప్రసిద్ధి చెందింది.
2018 లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫరీదాబాద్ను ప్రపంచంలోనే రెండవ అత్యంత కలుషిత నగరంగా పరిగణించింది. [7] 2020 లో చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో, అత్యంత అపరిశుభ్రమైన భారత నగరాల్లో ఫరీదాబాద్ 10 వ స్థానంలో నిలిచింది..[8]
భారత ప్రభుత్వం వారు స్మార్ట్ నగరాల కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వంద భారత నగరాలలో ఫరీదాబాద్ ఒకటి.