కాంతి సంవత్సరం
ఖగోళ పొడవు యొక్క యూనిట్, కాంతి ఒక సంవత్సరంలో శూన్యంలో ప్రయాణించే దూరం అని నిర్వచించబడింది / From Wikipedia, the free encyclopedia
కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) అతి పెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు. కాంతి వేగము ఒక సెకనుకు 3 లక్షల కిలో మీటర్ల లెక్కన నిముషానికి 180 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలో మీటర్ల దూరం, రోజుకు 2592 కోట్ల కిలో మీటర్ల దూరం, సంవత్సరానికి 9 లక్షలా 50 వేల కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.