ఆఫ్రికా మహా సరస్సులు
ఆఫ్రికా చీలిక లోయలో ఉన్న మహా సరస్సులు / From Wikipedia, the free encyclopedia
ఆఫ్రికా మహా సరస్సులు తూర్పు ఆఫ్రికా చీలిక లోను, ఆ చుట్టుపక్కలా ఉన్న చీలిక లోయ సరస్సులలో భాగంగా వరుసగా ఉన్న సరస్సులు. ఈ వరుసలో విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన విక్టోరియా సరస్సు కూడా ఉంది. ఘనపరిమాణం, లోతు ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సైన టాంగన్యికా సరస్సు, విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోని ఎనిమిదో అతిపెద్ద మంచినీటి సరస్సైన మలావి సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత ఎడారి సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్కలీన్ సరస్సూ ఐన టర్కానా సరస్సు ఉన్నాయి. [1] సమిష్టిగా, వాటిలో 31,000 ఘన కి.మీ నీరు ఉంది. ఇది బైకాల్ సరస్సు లేదా ఉత్తర అమెరికా గ్రేట్ లేక్స్ కంటే ఎక్కువ. ఈ మొత్తం, యావత్తు గ్రహం పైని ఘనీభవించని ఉపరితల మంచినీటిలో 25% ఉంటుంది. ఆఫ్రికాలోని పెద్ద చీలిక సరస్సులు గొప్ప జీవవైవిధ్యానికి పురాతన నిలయం. ప్రపంచంలోని 10% చేప జాతులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి.
ఆఫ్రికా మహా సరస్సులు | |
---|---|
అక్షాంశ,రేఖాంశాలు | 8°00′00″S 35°00′00″E |
రకం | మంచినీటి సరస్సులు |
ఇందులో భాగం | తూర్పు ఆఫ్రికా చీలిక |
వెలుపలికి ప్రవాహం | తెల్ల నైలు నది, కాంగో నది, షైర్ నది |
ప్రవహించే దేశాలు | బురుండి, కాంగో గణతంత్ర రిపబ్లిక్, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, రువాండా, జాంబియా, టాంజానియా, ఉగాండా |
31,000 cubic kilometres (7,400 cu mi) |
ఆఫ్రికా మహాసరస్సుల ప్రాంతం లోని పరీవాహక దేశాలలో బురుండి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, రువాండా, జాంబియా, టాంజానియా, ఉగాండా లు ఉన్నాయి. [2]