అరబ్ లీగ్
From Wikipedia, the free encyclopedia
అరబ్ లీగ్ అరబ్ ప్రపంచంలోని ప్రాంతీయ సంస్థ. ఇది ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలో ఉంది. అధికారికంగా దీని పేరు లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్. అరబ్ లీగ్ కైరోలో 1945 మార్చి 22 న మొదట్లో ఈజిప్ట్, ఇరాక్, ట్రాన్స్జోర్డాన్ (1949లో జోర్డాన్ అని పేరు మార్చారు), లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా అనే ఆరుగురు సభ్యులతో ఏర్పడింది. యెమెన్ 1945 మే 5 న సభ్యునిగా చేరింది. ప్రస్తుతం, లీగ్‌లో 22 మంది సభ్యులు ఉన్నారు [4] అయితే 2011 నవంబరు నుండి సిరియాను సస్పెండు చేసారు.
అరబ్ లీగ్ جامعة الدول العربية Jāmiʿat ad-Duwal al-ʿArabiyya |
||||||
---|---|---|---|---|---|---|
సభ్యదేశాలు ముదురు ఆకుపచ్చ రంగులో; సస్పెండైన దేశాలు లేత ఆకుపచ్చలో
|
||||||
పరిపాలక కేంద్రం | కైరో | |||||
Official languages |
|
|||||
Demonym | అరబ్బులు | |||||
Type | ప్రాంతీయ సంస్థ | |||||
సభ్యులు | ||||||
Leaders | ||||||
- | సెక్రెటరీ జనరల్ | |||||
- | పార్లమెంటు స్పీకరు | |||||
- | కౌన్సిల్ అధ్యక్ష పదవి | Sudan | ||||
Legislature | అరబ్ పార్లమెంటు | |||||
Area | ||||||
- | మొత్తం విస్తీర్ణం | 1,31,32,327 km2 (2nd) 50,70,420 sq mi |
||||
Population | ||||||
- | 2018 estimate | 40,67,00,000[2] (3rd) | ||||
- | Density | 27.17/km2 70.37/sq mi |
||||
GDP (nominal) | 2021 estimate | |||||
- | Total | $2.7 trillion[3] (8th) | ||||
- | Per capita | $6,600 | ||||
Currency |
|
|||||
Time zone | (UTC+0 to +4) | |||||
Website www.LasPortal.org |
||||||
a. | 1979 నుండి 1989 వరకు, ట్యునిస్ ట్యునీషియా. | |||||
b. | సిరియన్ అరబ్ రిపబ్లిక్‌ను సస్పెండు చేసారు. |
లీగ్ ప్రధాన లక్ష్యం "సభ్య దేశాల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేయడం, వాటి మధ్య సహకారాన్ని సమన్వయం చేయడం, వారి స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, సాధారణంగా అరబ్ దేశాల వ్యవహారాలు, ప్రయోజనాలను పరిగణించడం". [5] సంస్థ చరిత్రలో సాపేక్షంగా తక్కువ స్థాయిలో సహకారాన్ని పొందింది. [6]
అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO), దాని కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఎకనామిక్ యూనిటీ (CAEU) యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ, సామాజిక రంగాల్లో అరబ్ ప్రపంచపు ప్రయోజనాలను ప్రోత్సహించడానికి లీగ్‌ను ఏర్పరచారు. [7][8] ఇది సభ్య దేశాల విధానాలను సమన్వయం చేయడానికి, ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన విషయాలపై అధ్యయనాలకు కమిటీలను ఏర్పాటు చేయడానికి, అంతర్-దేశ వివాదాలను పరిష్కరించుకోవడానికి, 1958 లెబనాన్ సంక్షోభం వంటి సంఘర్షణలను పరిమితం చేయడానికి ఒక వేదికగా పనిచేసింది. ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహించే అనేక మైలురాయి పత్రాల ముసాయిదాలు, తీర్మానాల కోసం లీగ్ ఒక వేదికగా పనిచేసింది. ఒక ఉదాహరణ జాయింట్ అరబ్ ఎకనామిక్ యాక్షన్ చార్టర్. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సూత్రాలను వివరిస్తుంది.
అరబ్ లీగ్ కౌన్సిల్లో ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. నిర్ణయాలకు అనుకూలంగా వారికి ఓటు వేసిన దేశాలకు మాత్రమే వర్తిస్తాయి. 1945లో లీగ్ లక్ష్యాలు దాని సభ్యుల రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను బలోపేతం చేయడం, సమన్వయం చేయడం, సభ్యుల మధ్య లేదా సభ్యులకు బయటి పక్షాలకూ మధ్య ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం చేయడంగా ఉండేవి. ఇంకా, 1950 ఏప్రిల్ 13 న జాయింట్ డిఫెన్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఒప్పందంపై సంతకం చేయడంతో సైనిక రక్షణ చర్యల సమన్వయానికి కూడా సభ్యులు కట్టుబడి ఉన్నారు. 2015 మార్చిలో అరబ్ లీగ్ జనరల్ సెక్రటరీ, అరబ్ దేశాల్లో తీవ్రవాదాన్ని, ఇతర బెదిరింపులనూ ఎదుర్కొనే లక్ష్యంతో జాయింట్ అరబ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యెమెన్‌లో ఆపరేషన్ డిసైసివ్ స్టార్మ్ తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులో పాల్గొనడం స్వచ్ఛందంగా ఉంటుంది. సభ్య దేశాలలో ఒకదాని అభ్యర్థన మేరకు మాత్రమే సైన్యం జోక్యం చేసుకుంటుంది. అనేక సభ్య దేశాలలో సైనిక ఆయుధాల పెంపుదల, అంతర్యుద్ధాలు అలాగే తీవ్రవాద ఉద్యమాలు JAF ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయి. దీనికి ధనిక గల్ఫ్ దేశాలు ఆర్థిక సహాయం చేసాయి. [9]
1970వ దశకం ప్రారంభంలో ఎకనామిక్ కౌన్సిల్, యూరోపియన్ దేశాల్లో అంతటా జాయింట్ అరబ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌ను రూపొందించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దాని డిక్రీ K1175/D52/G ప్రకారం అరబ్ బ్రిటిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుకు దారితీసింది. అరబ్ ప్రపంచం, తమ ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం సులభతరం చేయడం దీని లక్ష్యం.