మరణం
జీవిలోని కీలక వ్యవస్థలన్నీ శాశ్వతంగా పని చెయ్యడం ఆగిపోవడం / From Wikipedia, the free encyclopedia
పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం (ఆంగ్లం: Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది చిరంజీవులుగా పేర్కొనబడ్డారు.