దుస్తులు
From Wikipedia, the free encyclopedia
మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.దుస్తులను ధరించే పద్ధతి సామాజిక, భౌగోళిక, ఆర్థిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |