2006 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
తమిళనాడు పదమూడవ శాసనసభకు ఎన్నికలు 2006 మే 8 న జరిగాయి. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మొత్తం 234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మూడు రోజుల తర్వాత 2006 మే 11 న ఓట్లు లెక్కించారు. ఆ రోజే అన్ని ఫలితాలు వెలువడ్డాయి. ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని (డిఎమ్‌కె) ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. డిఎమ్‌కె 96 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని నాయకుడు M కరుణానిధి ఐదవ సారి, చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో రాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఫలితంగా, డిఎమ్‌కె దాని మిత్రపక్షాలతో కలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1952 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇదే మొదటిది. ఈ ఎన్నికల తరువాత 13వ అసెంబ్లీ ఏర్పాటైంది.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 118 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 70.56%(11.49%) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఈ ఎన్నికలు నటుడు విజయకాంత్‌కు అతని రాజకీయ పార్టీ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) కు తొలి ఎన్నికలు. పార్టీ ఒక్క సీటును మాత్రమే పొందగలిగినప్పటికీ, అది డిఎంకె, ఎఐఎడిఎంకె రెండింటి ఓట్ల వాటాకు కోతపెట్టింది. ఇప్పటికే ఉన్న రెండు ద్రావిడ పార్టీలకు మూడవ ప్రత్యామ్నాయంగా ఉద్భవించింది.