1908 వేసవి ఒలింపిక్ క్రీడలు
1908లో లండన్ లో జరిగిన క్రీడలు / From Wikipedia, the free encyclopedia
1908 ఒలింపిక్ క్రీడలు లండన్లో జరిగాయి. ఇవి ఆధునిక ఒలింపిక్ క్రీడల పరంరపలో నాలుగవది. వాస్తవానికి 4వ ఒలింపిక్ క్రీడలు ఇటలీ రాజధాని నగరం రోంలో 1906లో జరుగవలసి ఉన్ననూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ఈ క్రీడలను నాలుగేళ్ళకోసారి మాత్రమే నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించినందువల్ల నాల్గవ ఒలింపిక్ క్రీడలు లండన్లో జరిగాయి. ఈ క్రీడలలో 22 దేశాల నుంచి 2008 క్రీడాకారులు 22 క్రీడలు, 110 క్రీడాంశాలలో పోటీపడ్డారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ పోటీలు అక్టోబర్ 31 వరకు జరిగాయి. నిర్వాహక దేశమైన బ్రిటన్ 56 స్వర్ణాలతోపాటు మొత్తం 146 పతకాలను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది.