వైడ్ బాల్
From Wikipedia, the free encyclopedia
క్రికెట్లో, వైడ్ అనేది బౌలరు వేసే ఒక రకమైన చట్టవిరుద్ధమైన డెలివరీ. బౌలరు వేసిన బంతి బ్యాటరుకు అందనంత దూరంగా గానీ, చాలా ఎత్తుగా గానీ వస్తే అంపైరు దాన్ని వైడ్గా ప్రకటిస్తాడు. అటువంటి చట్టవిరుద్ధమైన డెలివరీకి పర్యవసానంగా బ్యాటింగ్ జట్టుకు పరుగు లభిస్తుంది. దీన్ని ఎక్స్ట్రాగా పరిగణిస్తారు.