వేసవి లేని సంవత్సరం
From Wikipedia, the free encyclopedia
1816 ను వేసవి లేని సంవత్సరం అని అంటారు. దీన్ని బీదరికపు సంవత్సరం అని, పద్దెనిమిద వందల మృత్యుశీతలం అనీ కూడా అంటారు.[1] తీవ్రమైన వాతావరణ వైపరీత్యాల కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు 0.4–0.7 °C పడిపోవడంతో.[2] ఏర్పడిన పరిస్థితుల వలన దీన్ని అలా పిలుస్తారు. దీనివలన ఉత్తరార్థగోళంలో పెద్దయెత్తున ఆహార కొరత ఏర్పడింది.[3]
త్వరిత వాస్తవాలు వేసవి లేని సంవత్సరం, అగ్నిపర్వతం ...
వేసవి లేని సంవత్సరం | |
---|---|
అగ్నిపర్వతం | తంబోరా పర్వతం |
తేదీ | April 10, 1815 |
Type | అల్ట్రా ప్లీనియన్ |
ప్రదేశం | లెస్సర్ సుండా దీవులు, డచ్చి ఈస్ట్ ఇండీస్ దీవులు (నేటి ఇండోనేషియా) 8°15′S 118°0′E |
VEI (ఎక్స్ప్లోజివిటీ ఇండెక్సు | 7 |
తాకిడి | అగ్నిపర్వత శీతలం ఏర్పడి, ప్రపంచవ్యప్తంగా ఉష్ణోగ్రతలు 0.4–0.7 °C పడిపోయాయి. |
మూసివేయి
1815 లో ఇండోనేషియా లోని సంబావా దీవి (అప్పటి డచ్ ఈస్ట్ ఇండీస్) లోని తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటం ఈ వైపరీత్యానికి ప్రధాన కారణం. 1300 ఏళ్ళ తరువాత ఇంత పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే. అంతకు ముందు, 1814 లో జరిగిన ఫిలిప్పీన్స్ లోని మాయోన్ అగ్నిపర్వతం పేలుడు, ఈ పేలుడు ప్రభావాన్ని తీవ్రతరం చేసింది.