వెనుజ్వేలా
From Wikipedia, the free encyclopedia
వెనుజ్వేలా Venezuela (/ˌvɛnəˈzweɪlə/ ( listen) VEN-ə-ZWAYL-ə; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది. జీవవైవిధ్యంలో వెనుజ్వేలా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశ అతివలు తరచుగా అందాల పోటీలలో గెలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏంజెల్స్ జలపాతము ఈ దేశములోనే ఉంది.[5] పశ్చిమంలో ఆండెస్ పర్వతాలు, దక్షింఅంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాల వరకు లాస్ లానోస్ మైదానాలు, మద్యభూభాగంలో కరీబియన్ సముద్రతీరాలు, తూర్పుభూభాగంలో ఒరినోకో డెల్టా మీదుగా మానవనివాసాలు విస్తరించి ఉన్నాయి.ప్రస్తుతం వెనుజ్వేలా అని పిలువబడే ఈ ప్రాంతం స్థానికుల వ్యతిరేకతను అధిగమించి 1522లో స్పెయిన్ కాలనీ రాజ్యంగా ఉండేది. 1811లో ఇది మొదటి ఫ్రెంచి అమెరికన్ కాలనీ రాజ్యం నుండి " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజ్వేలా "గా ప్రకటించబడింది. అయినప్పటికీ 1821 వరకు సురక్షిత రాజ్యంగా స్థాపించబడలేదు. అప్పటి వరకూ వెనుజ్వేలా ఫెడరల్ రిపబ్లిక్ గ్రాన్ కొలంబియాలో శాఖగా ఉంది. 1830లో వెనుజ్వేలా ప్రత్యేకమైన పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం సగం (1958) వరకు వెనుజ్వేలా రాజకీయ అల్లర్లు , నియంతృత్వ ధోరిణి మొదలైన సమస్యలను ఎదుర్కొన్నది.దేశంలో ప్రాంతీయ కౌడిల్లోస్ (సైనిక వీరులు) ఆధిక్యత కొనసాగింది.1958 నుండి దేశంలో డెమిక్రటిక్ ప్రభుత్వాల పాలన కొనసాగింది. 1980 , 1990 లలో నెలకొన్న ఆర్థికసంక్షోభం పలు రాజకీయ సంక్షోభాలకు దారితీసాయి.1989లో తీవ్రమైన కరకాజో తిరుగుబాటు, 1992 లో రెండు మార్లు తిరుగుబాటు ప్రయత్నాలు , 1993లో ప్రభుత్వనిధులను అపహరించాడని అధ్యక్షుడు " కార్లోస్ అండ్రెస్ పెరెజ్ "కు వ్యతిరేకంగా చేసిన అభిశంశన తీర్మానం ఇందులో భాగంగా ఉన్నాయి.ప్రభుత్వం పతనం తరువాత 1998లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1999 లో బొలివేరియన్ విప్లవంతో వెనుజ్వేలాలో కొత్తరాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దేశానికి " రిపబ్లికా బొలివేరియన్ డీ వెనుజ్వేలా " (బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజ్వేలా) గా పేరు మార్పిడి జరిగింది. వెనుజ్వేలా ఒక ఫెడరల్ ప్రెసిడెంషియల్ రిపబ్లిక్. ఇందులో 23 రాష్ట్రాలు ఉన్నాయి. కాపిటల్ జిల్లాలో కారాకాస్, ఫెడరల్ డిపెండెంసీలైన ద్వీపాలు భాగంగా ఉన్నాయి.ఎస్సెక్యుబో నదికి ఉత్తరంలో ఉన్న గయానా ప్రాంతాలన్నింటినీ (1,59,500 చ.కి.మీ) వెనుజ్వేలా విలీనం చేసుకుంది.[6] లాటిన్ అమెరికన్ దేశాలలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో వెనుజ్వేలా ఒకటి. [7][8] వెనుజులియన్లలో అత్యధిక ప్రజలు ఉత్తరభూభాగంలోని నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని నగరం, అతిపెద్ద వెనుజ్వేలా నగరం అయిన కారాకాస్ నగరంలో అధికంగా నివసిస్తున్నారు.
వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం
| |
---|---|
రాజధాని and largest city | కారకస్ |
అతిపెద్ద నగరం | రాజధాని |
జాతీయ భాష | స్పానిష్[b] |
జాతులు (2011[1]) |
|
పిలుచువిధం | వెనుజులియన్ |
ప్రభుత్వం | Federal అధ్యక్ష తరహా రాజ్యాంగ |
నికోలస్ మడురో | |
జార్జ్ అరియేజా | |
డియోస్దాడో కాబెల్లో | |
శాసనవ్యవస్థ | జాతీయ అసెంబ్లీ |
స్వాతంత్ర్యము | |
• స్పెయిన్ నుండి | 5 జూలై 1811 |
• from Gran Colombia | 13 జనవరి 1830 |
• Recognized | 30 March 1845 |
20 డిసెంబరు 1999 | |
విస్తీర్ణం | |
• మొత్తం | 916,445 km2 (353,841 sq mi) (33rd) |
• నీరు (%) | 0.32[d] |
జనాభా | |
• 2011 census | 28,946,101 (44th) |
• జనసాంద్రత | 30.2/km2 (78.2/sq mi) (181st) |
GDP (PPP) | 2013 estimate |
• Total | $408.805 billion[2] |
• Per capita | $13,634[2] |
GDP (nominal) | 2013 estimate |
• Total | $382 424 billion[2] |
• Per capita | $11,527[2] |
జినీ (2010) | 39[3] medium |
హెచ్డిఐ (2013) | 0.748[4] high · 61st |
ద్రవ్యం | Bolívar fuerte[e] (VEF) |
కాల విభాగం | UTC–4 (VET) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +58 |
Internet TLD | .ve |
|
'
20వ శతాబ్దంలో ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. అంతకు ముందు అభివృద్ధి చెందని కాఫీ, కొకకయా వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ఆయిల్ ఎగుమతులు ఆక్రమించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి దశకు తీసుకువచ్చాయి. 1980 ఆయిల్ గ్లట్ ఋణ సంక్షోభం, ఆర్థిక సంక్షోభాలకు దారితీసింది. 1996 నాటికి ద్రవ్లోల్భణం 100% నికి చేరుకుని 1995 నాటికి పేదరికం 66% నికి చేరుకుంది.[9] 1998 నాటికి తలసరి జి.డి.పి 1963 స్థాయికి చేరుకుంది. 1978 తలసరి జి.డి..పి.లో ఇది మూడవవంతు ఉంది. [10] 2000 నాటికి ఆయిల్ ధరలు కొత అధికరించి దేశ ఆదాయం అధికరించింది.[11] తరువాత వెనుజ్వేలా ప్రభుత్వం పాపులిస్ట్ విధానాలు చేపట్టింది. ఇది వెనుజ్వేలా ప్రభుత్వ ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసి కొనుగోలు శక్తిని అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతను, పేదరికాన్ని తగ్గించింది.[11]
[12][13][14] అయినప్పటికి తరువాత ఈ విధానాలు వివాదాస్పదం అయ్యాయి. ఫలితంగా ఆర్థిక వత్తిడి, పేదరికం, వ్యాధులు, శిశుమరణాలు, పోషకారలోపం, నేరం అధికరించాయి.[15][16][11][17][18][19][20][21]