వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్
From Wikipedia, the free encyclopedia
వింబుల్డన్ ఛాంపియన్షిప్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంటు. సాధారణంగా దీన్ని వింబుల్డన్ అని పిలుస్తారు.[lower-alpha 3] క్రీడాకారులు దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.[2][3][4][5] 1877 నుండి లండన్‌లోని వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్లో నిర్వహించేవారు. 2019 నుండి రెండు ప్రధాన కోర్టులపై మూసుకునే పైకప్పులు కలిగిన అవుట్డోర్ గ్రాస్ కోర్ట్లలో నిర్వహిస్తున్నారు.
దస్త్రం:Wimbledon.svg | |
ప్రారంభం | 1877; 147 సంవత్సరాల క్రితం (1877) |
---|---|
ఎడిషన్లు | 136 (2023) |
స్థలం | London ఇంగ్లాండ్ |
వేదిక | All England Lawn Tennis and Croquet Club Worple Road (1877–1921) Church Road (since 1922) |
నేల | పచ్చిక [lower-alpha 1] |
బహుమాన ధనం | £44,700,000 (2023)[1] |
డ్రా | S (128Q) / 64D (16Q)[lower-alpha 2] |
ప్రస్తుత ఛాంపియన్లు | Carlos Alcaraz (singles) Wesley Koolhof / Neal Skupski (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | రోజర్ ఫెదరర్ (8) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | టాడ్ వుడ్‌బ్రిడ్జ్ (9) |
డ్రా | S (128Q) / 64D (16Q) |
ప్రస్తుత ఛాంపియన్లు | Markéta Vondroušová (singles) Hsieh Su-wei / Barbora Strýcová (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | మార్టినా నవ్రతిలోవా (9) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | ఎలిజబెత్ ర్యాన్ (12) |
డ్రా | 32 |
అత్యధిక టైటిళ్ళు (పురుషులు) | లియాండర్ పేస్ (4) విక్ సీక్సాస్ (4) ఓవెన్ డేవిడ్సన్ (4) కెన్ ఫ్లెచర్ (4) |
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు) | ఎలిజబెత్ ర్యాన్ (7) |
[[2023|]] |
నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ ఒకటి. మిగిలినవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్. వింబుల్డన్ ఇప్పటికీ గడ్డిపై ఆడే ఏకైక ప్రధానమైన టోర్నమెంటు.
సాంప్రదాయికంగా ఈ టోర్నమెంటు జూన్ చివరిలో, జూలై మొదట్లో రెండు వారాల పాటు జరుగుతుంది. జూన్ చివరి సోమవారం మొదలై, జూలై రెండవ శని, ఆదివారాలు జరిగే స్త్రీ, పురుష సింగిల్స్ ఫైనల్స్‌తో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ఐదు ప్రధాన పోటీలతో పాటు, జూనియర్, ఆహ్వాన పోటీలు కూడా జరుగుతాయి. 2009లో, వర్షం కారణంగా ఆట సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌కు మూసుకునే పైకప్పును అమర్చారు.
137వ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లు 2024 జూలై 1 నుండి 2024 జూలై 14 వరకు జరుగుతాయి.