లియొనార్డో డా విన్సీ
From Wikipedia, the free encyclopedia
లియొనార్డో డా విన్సీ (ఆంగ్లం: Leonardo Da Vinci) (ఏప్రిల్ 15, 1452 – మే 2, 1519) ఇటలీకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.[2] ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత.[3] రినైజెన్స్ శైలిలో ఇతడు చిత్రీకరించిన మోనా లీసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చాయి.[4] ప్రత్యేకించి మోనా లీసా చిత్రపటం చిత్రకళకు సంబంధించిన అంశాల వలన, దాని చరిత్ర వలన సంచలనాత్మకం అయ్యి, డా విన్సీ పేరుప్రతిష్టలు నేలనాలుగు చెరుగులా వ్యాపింపజేసాయి. డా విన్సీ నోటుపుస్తకాలలో వేసిన స్కెచ్ లు, శాస్త్రీయ శోధన, యంత్ర నిర్మాణం లో సృజనాత్మకత లకు మచ్చుతునకలుగా మిగిలిపోయాయి. [2]
లియొనార్డో డావిన్సి | |
Self-portrait in red chalk, Royal Library of Turin Circa 1512 to 1515 [1] | |
జన్మ నామం | లియొనార్డో డి సెర్ పీరో |
జననం | (1452-04-15)1452 ఏప్రిల్ 15 విన్సి లేదా వించి, ఫ్లోరెన్స్, ప్రస్తుతం ఇటలీలో వున్నది |
మరణం | 1519 మే 2(1519-05-02) (వయసు 67) అంబోయిసె, ఇండ్రె ఎట్ లోయిరె, ప్రస్తుతం ఫ్రాన్సులో వున్నది |
జాతీయత | ఇటాలియన్ |
రంగం | కళలు శాస్త్రాలు కు చెందిన అనేక రంగాలు |
ఉద్యమం | హై రెనసాన్స్ |
కృతులు | మొనాలిసా, ద లాస్ట్ సప్పర్, ద విట్రూవియన్ మాన్ |
డా విన్సీ అంతెరుగని జ్ఞాన కాంక్షయే అతని ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను నడిపించింది. సహజ సిద్ధంగాను, స్వాభావికంగా కూడాను కళాకారుడైన డా విన్సీ తన కళ్ళే తన జ్ఞానార్జన కు దారులు అని భావించాడు. అనుభవం యొక్క సత్యాలను, నిఖార్సుగా, ఖచ్చితంగా నమోదు చేసేది చూపే కాబట్టి, చూపే మనిషి యొక్క ఇంద్రియ శక్తులలో ఉన్నతమైనది అని డా విన్సీ భావన. ఈ భావనకు అత్యుత్తమ మేధస్సు, అసాధారణమైన పరిశీలనాత్మకత (గమనించే శక్తి), ప్రకృతిని అభ్యసించేందుకు తన చేతులతో దాగియున్న అత్యున్నత చిత్రలేఖన పటిమ వంతివి తోడు కావటంతో ఇటు పలు కళలలోను, అటు పలు శాస్త్రాలలోను డా విన్సీ రాణించేలా చేశాయి.[2]