మోల్డోవా
From Wikipedia, the free encyclopedia
మోల్డోవా /mɒlˈdoʊvə/ (help·info), అధికారకంగా రిపబ్లిక్ అఫ్ మోల్డోవా అని పిలవబడే ఈ దేశం, తూర్పు ఐరోపా లోని భూపరివేష్టిత దేశం. ఈ దేశము పశ్చిమలో రోమేనియా కు , ఉత్తరము, తూర్పు, దక్షిణములో ఉక్రెయిన్ కు మధ్యలో ఉంది. సోవియట్ యూనియన్ రద్ధయినప్పుడు, 1991లో అప్పుడు ఉన్న మోల్దోవన్ SSR కు ఉన్న అదే సరిహద్దులతో మాల్డోవ ఒక స్వతంత్ర దేశముగా తనకు తానుగా ప్రకటించుకున్నది. అంతర్జాతీయంగా గుర్తించబడిన మోల్డోవా లోని డ్నిస్టర్ నదికి తూర్పు తీరములో ఉన్న ఒక ప్రదేశం, 1990 నుండి విడిపోయిన ట్రాన్స్నిస్ట్రియ ప్రభుత్వ అధీనంలో ఉంది.
మొల్దోవా రిపబ్లిక్ Republic of Moldova |
||||||
---|---|---|---|---|---|---|
Anthem |
||||||
ఐరోపా ఖండంలో (green + dark grey)
మొల్దోవా స్థానం(green) |
||||||
రాజధాని | చిసినావ్ 47°0′N 28°55′E | |||||
Largest city | రాజధాని | |||||
Official languages | మోల్దోవన్, రోమేనియన్ | |||||
ప్రాంతీయ భాషలు | Gagauz, రష్యన్, ఉక్రేనియన్ and బల్గేరియన్ | |||||
Demonym | మోల్దోవన్, మొల్దావియన్ | |||||
ప్రభుత్వం | Parliamentary republic | |||||
- | అధ్యక్షుడు | Mihai Ghimpu | ||||
- | ప్రధాన మంత్రి | |||||
- | Speaker of the Parliament | |||||
ఏకీకరణ | ||||||
- | సార్వభౌమాధికార ప్రకటన | 1990 జూన్ 23 | ||||
- | సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్య ప్రకటన | 1991 ఆగస్టు 272 |
||||
Area | ||||||
- | Total | 33,846 km² (139th) 13,067 sq mi |
||||
- | Water (%) | 1.4 | ||||
జనాభా | ||||||
- | January 1, 2009[1] estimate | 3,567,500 (does not include Transnistria and Bender) (129st3) | ||||
- | 2004 census | 3,383,3324 | ||||
- | జనసాంద్రత | 121,9/km² (87th) 316/sq mi |
||||
జి.డి.పి. (పి.పి.పి.) | 2009 estimate | |||||
- | Total | $10.141 billion[2] | ||||
- | Per capita | $2,842[2] | ||||
జి.డి.పి. (nominal) | 2009 estimate | |||||
- | Total | $5.403 billion[2] | ||||
- | Per capita | $1,514[2] | ||||
Gini? (2007) | 37.1 (medium) | |||||
మానవ అభివృద్ధి సూచిక (2007) | 0.708 (medium) (111th) | |||||
కరెన్సీ | Moldovan leu (MDL ) |
|||||
టైమ్ జోన్ | EET (యు.టి.సి.+2) | |||||
- | Summer (డి.ఎస్.టి.) | EEST (యు.టి.సి.+3) | ||||
Internet TLD | .md | |||||
Calling code | [[+373]] | |||||
1 | "Moldovan" used as formal official name; in fact Romanian. | |||||
2 | Proclaimed. Finalized along with the dissolution of the USSR in December 1991. | |||||
3 | Ranking based on 2009 UN figure | |||||
4 | 2004 census data from the National Bureau of Statistics.[3] Figure does not include Transnistria and Bender. |
ఈ దేశము శాసనసభా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది. దేశ అధిపతిగా రాష్ట్రపతి ఉంటే, ప్రభుత్వ అధిపతిగా ప్రధాన మంత్రి ఉంటారు. యునైటడ్ నేషన్స్, కౌన్సిల్ అఫ్ ఐరోపా, WTఒ, OSCE, GUAM, CIS, BSE , ఇతర అంతర్జాతీయ సంస్థలల మాల్డోవ సభ్య దేశముగా ఉంది. ప్రస్తుతం మోల్డోవా యురోపియన్ యూనియన్[4]లో సభ్యత్వం కొరకు ప్రయత్నిస్తూ ఉంది. యూరోపియన్ పరిసరాలకు సంబంధించిన పాలసీ (ENP) కు అనుగుణంగా మోల్డోవా మొదటి మూడు-సంవత్సరాల కార్యాచరణని అమలు చేసింది.[5]
దేశ జనాభాలో నాల్గవ భాగం మంది జనం రోజుకు US$2 కంటే తక్కువ తోనే జీవిస్తున్నారు.[6]