మంగళూరు
From Wikipedia, the free encyclopedia
మంగళూరు (తుళు:కుడ్ల, ఆంగ్లము:Mangalore, కన్నడ: ಮಂಗಳೂರು, కొంకణి: కుడియాల్), పలకడం (సహాయం·సమాచారం), నగరం కర్ణాటక రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరం కర్ణాటక రాష్ట్రానికి, భారత దేశానికి ఒక నౌకాశ్రయము ఇచ్చింది. ఈ నగరం భారత దేశ పశ్చిమమున అరేబియా సముద్రముతీరములో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది.
?మంగళూరు కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 12.85°N 74.833°E / 12.85; 74.833 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
111.18 కి.మీ² (43 sq mi) • 8.83 మీ (29 అడుగులు) |
జిల్లా (లు) | దక్షిణ కన్నడ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
398,745 (2001 నాటికి) • 3,586.5/కి.మీ² (9,289/చ.మై) |
మేయరు | విజయ అరున్ |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 575001 • +0824 • KA-19 |
వెబ్సైటు: www.mangalorecity.gov.in |
మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని, అధికార, పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి, దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉంది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి, గుర్పుర్ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్ తీరంలో మంగళూరు ఒక భాగము.
మంగళూరు దేవాలయాలకు, బీచ్ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లము కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.
నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉంది.