బోస్టన్
From Wikipedia, the free encyclopedia
బోస్టన్ మహానగరము అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలోకెల్లా అతి పెద్దది అయిన బోస్టన్‌ను ఆ ప్రాంత ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా పరిగణిస్తారు.[1] 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.
1630లో ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు.[2] 18వ శతాబ్దంలో జరిగిన అమెరికా విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా, పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.
అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన బోస్టన్ లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన హార్వర్డు, అమెరికాలోనే మొట్టమొదటి సబ్వే రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా, ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు.[3]