బోయింగ్ 747
From Wikipedia, the free encyclopedia
ద జంబో జెట్[4][5]గా పిలువబడే బోయింగ్ 747 (Boeing 747) బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఒక వెడల్పు-ఎక్కువగల (wide-body) విమానం. ఇది ప్రపంచంలోనే అతి త్వరగా కనుక్కోగలిగే విమానము. ఇది 1950లలో వాడుకలో ఉన్న, బోయింగ్ 707 కంటే రెండున్నర రెట్లు పెద్దది.[6] ఈ విమానము ఎంత పెద్దదంటే, దీని రెక్కల పొడవు మొట్టమొదటి సారి రైట్ సోదరులు ఎగిరిన దూరంకన్నా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణీకుల రికార్డును 37 సంవత్సరాలు నిలబెట్టుకుంది.
ఈ వ్యాసం వ్యాకరణం సరిదిద్దవలిసిన అవసరం ఉంది వికీపీడియా శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యాసాన్ని మార్చండి. |
బోయింగ్ 747 | |
---|---|
| |
రకం | వెడల్పు-ఎక్కువగల (wide-body) జెట్ విమానము |
దేశం | అమెరికా |
తయారిదారు | బోయింగ్ |
మొట్ట మొదటి ప్రయాణము | 9 ఫిబ్రవరి1969[1] |
విడుదల | 1970. పాన్ అమెరికన్ వాయుమార్గాలతో (airlines) [1] |
ప్రస్తుతం | వాడుకలో ఉన్నది |
ఎక్కువగా వాడే వారు | బ్రిటీష్ ఎయిర్వేస్ జపాన్ ఎయిర్లైన్స్ క్యాతే పసిఫిక్ కొరియన్ ఎయిర్ |
తయారుచేసిన తేదీలు | 1969 – ప్రస్తుతం |
తయారుచేనినవి | మార్చి 2008 నాటికి 1,399 |
ధర | 747-100 అమెరికన్ డాలర్లు 24 మిలియన్ (1967) 747-200 $39 మిలియన్ (1976) 747-300 $83 మిలియన్ (1982) 747-400 $228-260 మిలియన్ (2007)[2] 747-8 $285.5-300 మిలియన్ (2007)[2][3] |
ఇతర మోడెల్లు | బోయింగ్ 747SP బోయింగ్ VC-25 బోయింగ్ 747-400 బోయింగ్ 747-8 బోయింగ్ 747 LCF |
747కి నాలుగు ఇంజన్లు, రెండు అంతస్తులు (double deck) ఉంటాయి. ఇది ప్రయాణికుల వెర్షన్, కార్గో వెర్షన్, ఇతర వెర్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతము వాడుకలో ఉన్న ఆధునిక మోడల్ 747-400 అత్యంత వేగమైన విమానాలలో ఒకటి. ఇది శబ్ద వేగానికి 0.85రెట్లు (గంటకు 913 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలదు. 747-400 ఎక్కడా ఆగకుండా 13,450 కిలోమీటర్లు ప్రయాణించగలదు.[7] 747-400లో 416 లేదా 524 మంది కూర్చోవచ్చు (డిజైనును బట్టి).
ప్రస్తుతానికి 1,399 747 విమానాలను బోయింగ్ కంపెనీ అమ్మింది. ఇప్పటికి ఇంకా 122 ఆర్డర్లు ఉన్నాయి.[8] 747లో అత్యాధునిక మాడల్ 747-8 2009లో విడులవుతంది.[9]