బేరెంట్స్ సముద్రం
నార్వే, రష్యాల ఉత్తర తీరాన ఉన్న సముద్రం / From Wikipedia, the free encyclopedia
బేరెంట్స్ సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రపు ఉపాంత సముద్రం. ఇది నార్వే, రష్యాల ఉత్తర తీరాలలో ఉంది. ఈ రెండు దేశాల ప్రాదేశిక జలాల మధ్య ఇది విభజించబడింది. [1] మధ్య యుగాలలో రష్యన్లలో దీన్ని ముర్మాన్ సముద్రం ("నార్స్ సముద్రం") అని పిలిచేవారు. ప్రస్తుత పేరు చారిత్రక డచ్ నావికుడైన విల్లెం బేరెంట్స్జ్ పేరు మీద వచ్చింది.
బేరెంట్స్ సముద్రం | |
---|---|
ప్రదేశం | ఆర్కిటిక్ మహాసముద్రం |
అక్షాంశ,రేఖాంశాలు | 75°N 40°E |
రకం | సముద్రం |
ప్రాథమిక ప్రవేశం | నార్వేజియన్ సముద్రం, ఆర్కిటిక్ సముద్రం |
బేసిన్ దేశాలు | నార్వే, రష్యా |
1,400,000 km2 (540,000 sq mi) | |
సగటు లోతు | 230 m (750 ft) |
మూలాలు | Institute of Marine Research, Norway |
ఇది పెద్దగా లోతులేని సముద్రం - సగటు లోతు 230 metres (750 ft) ఉంటుంది. ఇది చేపలవేటకు, చమురు గ్యాసుల అన్వేషణకూ ముఖ్యమైన ప్రదేశం. [2] బేరెంట్స్ సముద్రానికి దక్షిణాన కోలా ద్వీపకల్పం, పశ్చిమాన నార్వేజియన్ సముద్రం వైపు షెల్ఫ్ అంచు, వాయువ్యంలో స్వాల్బార్డ్ ద్వీపసమూహాలు, ఈశాన్యంలో ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్, తూర్పున నోవాయా జెమ్లియాలు సరిహద్దులుగా ఉన్నాయి. నోవాయా జెమ్లియా ద్వీపాలు, కారా సముద్రం నుండి బేరెంట్స్ సముద్రాన్ని వేరు చేస్తాయి.
ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగమైనప్పటికీ, బేరెంట్స్ సముద్రం " అట్లాంటిక్గా మారుతోంది" [3] లేదా "అట్లాంటిఫై" అయ్యే ప్రక్రియలో ఉంది. [4] ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వస్తున్న హైడ్రోలాజికల్ మార్పులు సముద్రపు మంచు తగ్గడానికి, నీటి స్తరీకరణకూ దారితీశాయి. ఇది యురేషియాలో వాతావరణంలో పెద్ద మార్పులను సృష్టించగలదు. [3] బేరెంట్స్ సముద్రంలో శాశ్వత మంచు రహిత ప్రాంతం పెరిగేకొద్దీ పెరిగే అదనపు బాష్పీభవనం, ఐరోపా ఖండంలో చాలా ప్రాంతాల్లో శీతాకాలపు హిమపాతం పెరుగుతుందని ఒక అంచనా.