బాబ్ ఫోస్సే
అమెరికన్ సినిమా-నాటకరంగ దర్శకుడు, నటుడు, నృత్యదర్శకుడు / From Wikipedia, the free encyclopedia
రాబర్ట్ లూయిస్ ఫోస్సే (1927, జూన్ 23 – 1987, సెప్టెంబరు 23) అమెరికన్ సినిమా-నాటకరంగ దర్శకుడు, నటుడు, నృత్యదర్శకుడు.[1] ది పైజామా గేమ్ (1954), డామ్ యాన్కీస్ (1955), హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ వితౌట్ రియల్లీ ట్రైయింగ్ (1961), స్వీట్ ఛారిటీ (1966), పిప్పిన్ (1972), చికాగో (1975), స్వీట్ ఛారిటీ (1969), క్యాబరేట్ (1972), లెన్ని (1975), ఆల్ దట్ జాజ్ (1979), స్టార్ 80 (1983) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.
త్వరిత వాస్తవాలు బాబ్ ఫోస్సే, జననం ...
బాబ్ ఫోస్సే | |
---|---|
జననం | రాబర్ట్ లూయిస్ ఫోస్సే (1927-06-23)1927 జూన్ 23 చికాగో, ఇల్లినాయిస్, యుఎస్ |
మరణం | 1987 సెప్టెంబరు 23(1987-09-23) (వయసు 60) వాషింగ్టన్, డి.సి., యుఎస్ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1947–1987 |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | ఆన్ రీంకింగ్ (1972–1978) |
పిల్లలు | నికోల్ ఫోస్సే |
మూసివేయి
1973లో ఒకే సంవత్సరంలో ఆస్కార్, ఎమ్మీ, టోనీ అవార్డులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఫోస్సే. నాలుగు అకాడమీ అవార్డులకు నామినేట్ అవ్వడంతోపాటు క్యాబరే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుపొందాడు. 1980లో ఆల్ దట్ జాజ్ సినిమాకు పామ్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. తన కొరియోగ్రఫీకి రికార్డుస్థాయిలో ఎనిమిది టోనీ అవార్డులను గెలుచుకున్నాడు.