పాముచేప
From Wikipedia, the free encyclopedia
పాముచేప ఆంగ్విలీఫార్మస్ (Anguilliformes) అనే జాతికి చెందిన పొలుసుగల చేప. ఇది వేటాడి తినే గుణంగల చేప. ఆంగ్విలీఫార్మస్ జాతియందు నాలుగు ఉపజాతులు, ఇరవై కుటుంబాలు, నూటపదకొండు కులాలు, దాదాపు ఎనిమిది వందల పాముచేపల రకాలున్నాయి. ఈ పాముచేపలు తమ పుట్టినదశ నుండి యుక్తవయసుకు వచ్చే మార్గంలో చాలా మార్పు చెందుతాయి. సాధారణంగా పాముచేప అనే పదం ఐరోపా పాముచేపను సూచిస్తుంది. ఈ రకం చేపలలోకి "తిమ్మిరిచేప" (ఎలక్ట్రిక్ ఈల్), జన్యువు: ఎలక్ట్రోఫోరస్ (Electrophorus)), "వెన్నుపాము చేప" (ఆంగ్లం: స్పైనీ ఈల్ (Spiny Eel), కుటుంబం: మాస్టఖెంబెలిడే (Mastacembelidae)), "లోతుసముద్ర వెన్నుపాము చేప" (ఆంగ్లం: డీప్ సీ స్పైనీ ఈల్ (Deep Sea Spiny Eel), కుటుంబం: నోటఖాంథిడే (Notacanthidae)) వస్తాయి. పైన చెప్పిన చేపలు జంతుశాస్త్రపరంగా నిజమైన పాముచేపలు కాకపోయినా అవి కాలగమనంలో పాముచేపల గుణాలను సంతరించుకుని ఆ కుటుంబంలో భాగమయ్యాయి.