పాబ్లో ఎస్కోబార్
From Wikipedia, the free encyclopedia
పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా (1949 డిసెంబరు 1 - 1993 డిసెంబరు 2) కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు (కింగ్ ఆఫ్ కొకైన్) అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు,[2] తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు.[3][4]
పాబ్లో ఎస్కోబార్ | |
---|---|
జననం. | పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా (1949-12-01)1949 డిసెంబరు 1 రియోనెగ్రో, కొలంబియా |
మరణం | 1993 డిసెంబరు 2(1993-12-02) (వయసు 44) మెడలిన్, కొలంబియా |
నేరాలు | మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు, హత్యలు, బాంబింగ్, లంచాలు, రాకెట్ నిర్వహణ |
జరిమానా | 5 సంవత్సరాలు జైలుశిక్ష[1] |
వృత్తి | మెడలిన్ కార్టెల్ అనే స్మగ్లింగ్ వ్యవస్థ వ్యవస్థాపకుడు, రాజకీయ నాయకుడు |
జీవిత భాగస్వామి | మరియా విక్టోరియో (1976–1993; అతని మరణం వరకూ) |
పిల్లలు |
|
కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు; నేర కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించి క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనంలోనూ పాల్గొన్నాడు. 1970ల్లో పలువురు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు.ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్లో తొలి అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరిచి, పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్‌కి రవాణా చేసేవాడని అంచనా. అతని డ్రగ్ నెట్వర్కును అది పుట్టిన నగరం పేరు మీదుగా మెడెలిన్ కార్టెల్ అని పిలుస్తారు. ఈ మెడెలిన్ కార్టెల్‌కి దాని పోటీ కార్టెల్‌లతో జాతీయంగా, అంతర్జాతీయంగా స్పర్థ ఉండేది. దాని కారణంగా హత్యాకాండకు పాల్పడేవారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు చేసేవారు.
1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఈ అధికారం ఉపయోగించి పశ్చిమ కొలంబియాలో ఫుట్‌బాల్ మైదానాలు, ఇళ్ళు నిర్మించి ఇచ్చాడు. దాంతో ఆ పట్టణాల స్థానికుల్లో అతనికి మంచి ప్రాచుర్యం లభించింది. ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా, కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి.[5] 1993లో ఎస్కోబార్‌ని అతని 44వ పుట్టినరోజుకు ఒకరోజు తర్వాత స్వంత పట్టణంలో కొలంబియన్ నేషనల్ పోలీసులు కాల్చిచంపారు.