నెల
From Wikipedia, the free encyclopedia
నెల (మాసం) కాలమునకు ప్రమాణం. ఇది క్యాలండర్లలో ఉపయోగించబడుతుంది. ఇది చంద్రుని కదలికకు సంబంధించిన సహజ కాలానికి సుమారు సమానంగా ఉంటుంది. చంద్రుడు, నెల అనేవి ఒకదానికొకటి సంబంధం ఉన్న పదాలు. సాంప్రదాయకంగా ఈ భావన చంద్ర దశలతో ఉధ్బవించింది. అటువంటి నెలలను చాంద్రమాన మాసములు అంటారు. ఇది సుమారు 29.53 రోజులకు సమనంగా ఉంటుంది. త్రవ్వకాలలో లభించిన గణన కర్రలు (టాలీ స్టిక్) ల నుండి పాలియోలిథిక్ యుగం యుగం ప్రారంభంలోనే ప్రజలు చంద్రుని దశలకు సంబంధించి రోజులు లెక్కించారని పరిశోధకులు ఊహించారు. భూమి-సూర్య రేఖకు సంబంధించి చంద్రుని కక్ష్య కాలం ఆధారంగా సైనోడిక్ నెలలు నేటికీ చాలా క్యాలెండర్లకు ఆధారం. అవి సంవత్సరానికి విభజించడానికి ఉపయోగిస్తారు.
చంద్రమానంప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు. మాసం అనగా 12 నెలలు కాలం. నెల సుమారు 30 రోజులు. నెలకు రెండు పక్షములు. ఒక పక్షం అనగా 15 రోజులు. అవి కృష్ణ పక్షం, శుక్ల పక్షం. చాంద్రమానం ప్రకారం చంద్రుని కళలు అమావాస్య నుండి పౌర్ణము వరకు కాలంలో దిన దినం చంద్రుని కళ ప్రవర్థమానమవుతుంది. ఈ కాలాన్ని శుక్ల పక్షం అనీ, పౌర్ణమి నుండి అమవాస్య వరకు చంద్రుని కళ రోజు రోజుకూ క్షీణిస్తుంది. ఈ కాలాన్ని కృష్ణ పక్షమనీ అంటారు. తెలుగు క్యాలండరు ప్రకారం అమావాస్య నుండి అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు.