నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు
From Wikipedia, the free encyclopedia
నెదర్లాండ్స్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ జట్టును "ది ఫ్లయింగ్ డచ్మెన్" అనే పేరుతో పిలుస్తారు.
దస్త్రం:Logo of cricket Netherlands.png | ||||||||||
అసోసియేషన్ | రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||||||||||
కెప్టెన్ | స్కాట్ ఎడ్వర్డ్స్ | |||||||||
కోచ్ | ర్యాన్ టెన్ డోషేట్ | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | అసోసియేట్ మెంంబరు, వన్డే స్టేటసుతో (1966) | |||||||||
ICC ప్రాంతం | యూరపియన్ క్రికెట్ కౌన్సిల్ | |||||||||
| ||||||||||
వన్డేలు | ||||||||||
తొలి వన్డే | v. న్యూజీలాండ్ రిలయన్స్ స్టేడియం, వదోదర; 1996 ఫిబ్రవరి 17 | |||||||||
చివరి వన్డే | v. శ్రీలంక హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే; 2023 జూలై 9 | |||||||||
| ||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 4 (first in 1996) | |||||||||
అత్యుత్తమ ఫలితం | గ్రూప్ దశ (1996, 2003, 2007, 2011) | |||||||||
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 12 (first in 1979 ఐసిసి ట్రోఫీ) | |||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2001 ఐసిసి ట్రోఫీ) | |||||||||
ట్వంటీ20లు | ||||||||||
తొలి టి20ఐ | v. కెన్యా స్టోర్‌మౌంట్, బెల్ఫాస్ట్; 2008 ఆగస్టు 2 | |||||||||
చివరి టి20ఐ | v. దక్షిణాఫ్రికా అడిలైడ్ ఓవల్, అడిలైడ్; 2022 నవంబరు 6 | |||||||||
| ||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 5 (first in 2009 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20) | |||||||||
అత్యుత్తమ ఫలితం | సూపర్ 10 (2014 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20) | |||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 6 (first in 2008 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు) | |||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2008, 2015 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు, 2019 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు | |||||||||
| ||||||||||
As of 2023 ఆగస్టు 20 |
నెదర్లాండ్స్‌లో కనీసం 19వ శతాబ్దం నుండి క్రికెట్ ఆడుతున్నారు. 1860లలో దేశంలో దీన్నొక ప్రధాన క్రీడగా పరిగణించారు. ప్రజాభిమానం విషయంలో ఇతర క్రీడలు - ముఖ్యంగా ఫుట్‌బాల్, ఫీల్డ్ హాకీ - క్రికెట్‌ను మించిపోయాయి. కానీ నేడు నెదర్లాండ్స్‌లో దాదాపు 6,000 మంది క్రికెటర్లు ఉన్నారు. నేటి రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్‌కు ముందున్న మొదటి జాతీయ సంఘం 1890లో ఏర్పడింది. నెదర్లాండ్స్ 1966లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అసోసియేట్ సభ్యత్వాన్ని సాధించింది.
నెదర్లాండ్స్ మొత్తం పదకొండు ICC ట్రోఫీ/వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటులలో పాల్గొంది. 2001లో కెనడాలో జరిగిన పోటీలో విజయం సాధించగా, మూడుసార్లు (1986, 1920, 2023 ) రన్నరప్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ 1996, 2003, 2007, 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లలో పాల్గొంది. 2023 ప్రపంచ కప్‌కు అర్హత పొందింది. 1995 నుండి జాతీయ జట్టు ఇంగ్లీష్ దేశీయ నాట్‌వెస్టు ట్రోఫీ పోటీలో (తరువాతి కాలంలో C&G ట్రోఫీ) ప్రవేశించింది. 2004లో వారు ICC ఇంటర్కాంటినెంటల్ కప్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. అబెర్డీన్లో స్కాట్లాండ్తో డ్రా చేసి, డెవెంటర్లో ఐర్లాండ్‌పై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూశారు.
నెదర్లాండ్స్ 2006 జనవరి 1 నుండి 2014 ఫిబ్రవరి 1 వరకు పూర్తి వన్డే అంతర్జాతీయ హోదాను పొందింది.[6] 2014 జూన్‌లో ట్వంటీ20 అంతర్జాతీయ హోదాను తిరిగి పొందారు.[7] 2018 మార్చిలో 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ తమ వన్డే హోదాను తిరిగి పొందింది. 2015 - 17 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఫలితంగా ఐసిసి టోర్నమెంటుకు ముందు ఈ హోదాను హామీ ఇచ్చింది. తద్వారా 2020 - 23 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌కు అర్హత సాధించారు. 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు హోదా కొనసాగింది.
2018 ఏప్రిల్‌లో, ICC తన సభ్యులందరికీ పూర్తి ట్వంటీ 20 అంతర్జాతీయ (T20I) హోదాను మంజూరు చేయాలని నిర్ణయించింది. కాబట్టి, 2019 జనవరి 1 తర్వాత నెదర్లాండ్స్‌కు, ఇతర ICC సభ్యులకూ మధ్య జరిగే అన్ని ట్వంటీ20 మ్యాచ్‌లు పూర్తి స్థాయి T20Iగా ఉంటాయి. [8] స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రస్తుత జట్టు కెప్టెన్.[9]