నికోలా టెస్లా
From Wikipedia, the free encyclopedia
నికోలా టెస్లా (ఆంగ్లం : Nikola Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్. తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు.[1] ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.[2] 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్, అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త. నికోలా టెస్లా పేటెంట్లు, పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.
నికోలా టెస్లా | |
---|---|
జననం | (1856-07-10)1856 జూలై 10 స్మిల్యాన్, ఆస్ట్రియా సామ్రాజ్యం (en:Military Frontier), ప్రస్తుతపు క్రొయేషియా |
మరణం | 1943 జనవరి 7(1943-01-07) (వయసు 86) న్యూయార్క్, న్యూయార్క్, అ.సం.రా |
నివాసం | ఆస్ట్రియా సామ్రాజ్యం హంగేరీ సామ్రాజ్యం ఫ్రాన్స్ USA |
పౌరసత్వం | ఆస్ట్రియా సామ్రాజ్యం (pre-1891) అమెరికన్ (post-1891) |
జాతి | సెర్బియన్ |
రంగములు | మెకానికల్ and ఎలక్ట్ర్రికల్ ఇంజనీరింగ్ |
వృత్తిసంస్థలు | Edison Machine Works en:Tesla Electric Light & Manufacturing Westinghouse Electric & Manufacturing Co. |
ప్రసిద్ధి | టెస్లా కాయిల్ టెస్లా టర్బైన్ టెలిఫోర్స్ en:Tesla's oscillator en:Tesla electric car en:Tesla principle en:Tesla's Egg of Columbus ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇండక్షన్ మోటార్ రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ వైర్లెస్ టెక్నాలజీ పార్టికల్ బీమ్ వెపన్ డెత్ రే en:Terrestrial stationary waves en:Bifilar coil en:Telegeodynamics en:Electrogravitics |
ప్రభావితం చేసినవారు | ఎర్నెస్ట్ మాష్ |
ప్రభావితులు | గనో డన్ |
ముఖ్యమైన పురస్కారాలు | ఎడిసన్ మెడల్ (1916) en:Elliott Cresson Gold Medal (1893) en:John Scott Medal (1934) |
సంతకం |
1894లో వైర్లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు.[3] టెస్లా ఆవిష్కరణలు ఆధునిక ఎలక్టికల్ ఇంజనీరింగ్ విభాగానికి మార్గదర్శకాలయ్యాయి.
ఈ కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో టెస్లా కీర్తి చరిత్రలో మరే ఇతర ఆవిష్కర్త లేదా శాస్త్రవేత్తతో పోల్చదగ్గదిగా[4] ఉన్నప్పటికీ అతని అసాధారణ వ్యక్తిత్వం, సాధ్యమైన శాస్త్రీయ, సాంకేతిక పరిణామాల గురించి నమ్మశక్యం కాని, కొన్నిసార్లు వికారమైన వాదనలు కారణంగా, టెస్లా చివరికి బహిష్కరించబడ్డాడు. అతను పిచ్చి శాస్త్రవేత్తగా పరిగణించబడ్డాడు.[5] [6] తన ఆర్థిక విషయాలపై ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెట్టని టెస్లా 86 సంవత్సరాల వయసులో పేదరికంతో మరణించాడు.
అతస్కాత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణ (సాధారణంగా అయస్కాత క్షేత్రం "B" గా సుపరిచితం) ఎస్.ఐ ప్రమాణం నకు అతని గౌరవార్థం "టెస్లా" గా నామకరణం చేసారు. అదే విధంగా టెస్లా 1893 లోనే తక్కువ స్థాయిలో (లైట్బల్బులు) ప్రదర్శించాడు. అసంపూర్తిగా ఉన్న తన వార్డెన్క్లిఫ్ టవర్ ప్రాజెక్టులో పారిశ్రామిక శక్తి స్థాయిలను ఖండాంతరాలకు ప్రసారం చేయాలని ఆకాంక్షించాడు. దీని ఫలితంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు వైర్లెస్ శక్తి బదిలీ టెస్లా ప్రభావం మూలంగా జరుగుతుంది.
అతను విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ యాంత్రిక ఇంజనీరింగ్ విభాగాల్లో చేసిన కృషి ఫలితంగా రోబోటిక్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ విజ్ఞానం, బాలిస్టిక్స్, కేంద్రక భౌతిక శాస్త్ర రంగాలలో పురోగతి సాధించగలిగింది.[7] 1943 లో యునైటెడ్ స్టేట్స్ లోని సుప్రీంకోర్టు అతన్ని రేడియో ఆవిష్కర్తగా పేర్కొంది.[8]