నాయుడుగారి కుటుంబం
From Wikipedia, the free encyclopedia
నాయుడుగారి కుటుంబం 1996లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణంరాజు, సుమన్, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1] ఈ సినిమాకు గాను పరుచూరి సోదరులు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. వీరికి ఇదే తొలి నంది పురస్కారం.
త్వరిత వాస్తవాలు నాయుడుగారి కుటుంబం, దర్శకత్వం ...
నాయుడుగారి కుటుంబం | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
రచన | వి.సి. గుహనాథన్ (కథ), పరుచూరి సోదరులు (చిత్రానువాదం/మాటలు) |
తారాగణం | సుమన్, సంఘవి |
ఛాయాగ్రహణం | పెమ్మసాని సురేష్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1996 మే 30 (1996-05-30) |
భాష | తెలుగు |
మూసివేయి