నాగపట్టినం
తమిళనాడులో ఒక పట్టణం / From Wikipedia, the free encyclopedia
నాగపట్నం, (గతంలో నాగపట్టినం లేదా నెగపటం అని పిలుస్తారు) భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని ఒక పట్టణం.ఇది నాగపట్నం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈపట్టణం మధ్యయుగ చోళుల కాలంలో (సా.శ. 9వ-12వ శతాబ్దం) ప్రాముఖ్యతను సంతరించుకుంది. తూర్పు వైపు నౌకాదళ యాత్రలకు, వాణిజ్యానికి.. ముఖ్యమైన నౌకాశ్రయంగా పనిచేసింది. రాజరాజ చోళ I సహాయంతో శైలేంద్ర రాజవంశానికి చెందిన విజయ రాజు మారా విజయత్తుం గవర్మన్ నిర్మించిన నాగపట్నంలోని చూడామణి విహారం ఆ కాలంలోముఖ్యమైన బౌద్ధ నిర్మాణం.[1][2]
Nagapattinam
Chola nadu | |
---|---|
Municipality | |
Nickname: City of Coromandel | |
Coordinates: 10.767200°N 79.844900°E / 10.767200; 79.844900 | |
Country | India |
State | Tamil Nadu |
District | Nagapattinam |
Region | Cauvery Delta |
Established | 1866 |
Government | |
• Type | Selection Grade Municipality |
• Body | Nagapattinam Municipality |
Area | |
• Total | 17.92 km2 (6.92 sq mi) |
Elevation | 29 మీ (95 అ.) |
Population (2011) | |
• Total | 1,02,905 |
• Rank | 32 |
• Density | 5,800/km2 (15,000/sq mi) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 611xxx |
Telephone code | 04365 |
Vehicle registration | TN 51 |
నాగపట్నం పోర్చుగీసు వారిచే స్థిరపడింది. తరువాత, డచ్ వారిఆధ్వర్యంలో 1660 నుండి 1781 వరకు డచ్ కోరమాండల్ రాజధానిగా పనిచేసింది. 1781 నవంబరులో ఈ పట్టణాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనంచే సుకుంది. ఇది 1799 నుండి 1845 వరకు బ్రిటిష్ వారి మద్రాసు ప్రెసిడెన్సీ కింద తంజావూర్ జిల్లాకు రాజధానిగా పనిచేసింది.[3] ఇది స్వతంత్ర భారతదేశంలో తంజావూరు జిల్లాలో భాగంగా కొనసాగింది. తరువాత 1991లో కొత్తగా సృష్టించబడిన నాగపట్నం జిల్లాకు ఇది ప్రధాన కార్యాలయంగా చేయబడింది. నాగపట్నం 17.92 km2 (6.92 sq mi) విస్తీర్ణంలో ప్రత్యేక తరగతి పురపాలక సంఘం ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఈ పట్టణం 1,02,905 మొత్తం జనాభాను కలిగి ఉంది.
నాగపట్నంలో ఎక్కువ మంది ప్రజలు సముద్రమార్గం ద్వారా చేపలు పట్టడం, వ్వాపార, వ్యవసాయ, పర్యాటక రంగాలలోఉపాధి పొందుతున్నారు.కాయారోహణస్వామి ఆలయం, సౌందరరాజపెరుమాళ్ ఆలయం ప్రధాన హిందూపుణ్యక్షేత్రాలు. నాగపట్నం సిక్కల్, వేలన్ కన్ని, పూంపుహార్, కొడియక్కరై, వేదారణ్యం, తరంగంబాడి ప్రాంతాలు పర్యాటకానికి ఆధారం. నాగపట్నానికి ప్రధాన రవాణా మార్గం రోడ్డు మార్గాలు. నగరానికి రైలు, సముద్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.