దక్షిణ భారతదేశం
భారతదేశ భౌగోళిక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
దక్షిణ భారతదేశం భారత ద్వీపకల్పంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతం. దీనికి సంస్కృత పదం దక్షిణాపథం నుండి డెక్కన్ అని పేరు కూడా వచ్చింది. దీనికి ఉత్తరాన నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలున్నాయి.
దక్షిణ భారతదేశం | |
---|---|
భారతదేశం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు, ప్రాంతాలు | |
అత్యధిక జనావాస ప్రాంతాలు (2011) | |
Area | |
• Total | 6,35,780 km2 (2,45,480 sq mi) |
Population | |
• Total | 25,30,51,953 |
• Density | 400/km2 (1,000/sq mi) |
Demonym(s) | దాక్షిణాత్యులు, ద్రావిడులు, ఆంధ్రులు, తెలగాణ్యులు, తెలుగువారు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మద్రాసీలు |
Time zone | IST (UTC+05:30) |
అధికారక భాషలు |
తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య గల దక్కన్ పీఠభూమితో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. తుంగభద్ర, కావేరి, కృష్ణ, గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసల, విజయనగర రాజులు మొదలైన రాజులు పరిపాలించారు. ఈ రాజవంశాలలో కొన్ని శ్రీలంక, శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ వారి జీవన విధానాలలో దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం కనిపిస్తుంది.
ఈ ప్రాంతం వ్యవసాయం, సాఫ్టువేరు, చలన చిత్ర రంగాలకు పేరుగాంచింది. ఇక్కడి ప్రజలు విద్యారంగంలో ముందుండడం వలన అత్యధిక తలసరి ఆదాయం ఉంది. ఇక్కడి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం. ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలు ఈ ప్రాంతం లోని ప్రధాన భాషలు.