తిరుమల (పట్టణం)
ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా, తిరుపతి (పట్టణ) మండలం లోని జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
తిరుమల, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా లోని ఒక ఆధ్యాత్మిక జనగణన పట్టణం. ఇది తిరుపతి పట్టణ సముదాయం లోని శివారు ప్రాంతాలలో ఒకటి. ఈ పట్టణం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక భాగం. ఇది తిరుపతి రెవెన్యూ డివిజన్ లోని తిరుపతి పట్టణ మండలంలో ఉంది. ఇది విష్ణు నివాసం అయిన తిరుమల వేంకటేశ్వర ఆలయంతో ఏడుకొండలుగా చెప్పబడుచున్న కొండల ప్రదేశంలో ఉన్న పట్టణం. ఇది పూర్తి శాఖాహార పట్టణం.తిరుమల అవిభాజ్య చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం.[6]
త్వరిత వాస్తవాలు Country, State ...
తిరుమల
| |
---|---|
తిరుమల | |
Nickname: Kaliyuga Vaikunta[4] | |
Coordinates: 13.680916°N 79.350600°E / 13.680916; 79.350600 | |
Country | భారతదేశం |
State | Andhra Pradesh |
District | Tirupati |
Mandal | Tirupati (rural) |
Area | |
• Total | 32.21 km2 (12.44 sq mi) |
Elevation | 976 మీ (3,202 అ.) |
Population (2011) | |
• Total | 7,741 |
• Density | 240/km2 (620/sq mi) |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 517 504 |
Telephone code | +91–877 |
Vehicle registration | AP-03 |
మూసివేయి