డొమినిక్ కార్క్
ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు / From Wikipedia, the free encyclopedia
డొమినిక్ గెరాల్డ్ కార్క్ (జననం 1971, ఆగస్టు 7) ఇంగ్లాండ్ మాజీ కౌంటీ, అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. కార్క్ కుడిచేతి లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్ చేశాడు. స్వింగ్, సీమ్ నియంత్రణకు ప్రసిద్ధి చెందాడు. 1995లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకు 7 వికెట్లతో అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ బౌలర్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డొమినిక్ గెరాల్డ్ కార్క్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1971-08-07) 1971 ఆగస్టు 7 (వయసు 52) న్యూకాజిల్-అండర్-లైమ్, స్టాఫోర్డ్‌షైర్, ఇంగ్లాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కార్కీ, హాఫ్-పింట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 188 సెం.మీ. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి fast-medium | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | గ్రెగ్ కార్క్ (కొడుకు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 572) | 1995 22 June - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 9 September - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 118) | 1992 24 August - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2002 22 September - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 7 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–1990 | Staffordshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–2003 | Derbyshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–2008 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2011 | Hampshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2011 12 September |
1990లో డెర్బీషైర్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన 1992లో 21 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. 1992 నుండి 2002 వరకు ఇంగ్లండ్ తరపున 69 మ్యాచ్‌లు ఆడాడు. వివాదాస్పద పరిస్థితులలో 2004లో లాంక్షైర్లో చేరడానికి ముందు కార్క్ 13 సంవత్సరాలు డెర్బీషైర్ కోసం ఆడాడు. 2008 సీజన్ తర్వాత లాంక్షైర్ను విడిచిపెట్టి, కార్క్ హాంప్‌షైర్‌లో చేరాడు, 2009 నుండి 2011 వరకు ఆడాడు. 2010, 2011 సీజన్లలో చాలా వరకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[2] హాంప్‌షైర్‌లో ఉన్నప్పుడు 2009 ఫ్రెండ్స్ ప్రావిడెంట్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 2010 ఫ్రెండ్స్ ప్రావిడెంట్ t20 లో కౌంటీకి నాయకత్వం వహించాడు. 2011 సీజన్ ముగింపులో హాంప్షైర్చే విడుదల చేయబడ్డాడు, కొంతకాలం తర్వాత 2011, సెప్టెంబరు 22న స్కై స్పోర్ట్స్ న్యూస్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని ప్రసిద్ధ మారుపేరు "కార్కీ" .