డల్లాస్
From Wikipedia, the free encyclopedia
డల్లాస్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అమెరికాలో ఇది 9వ స్థానంలో ఉంది. డల్లాస్ నగరం జలభాగం, డల్లాస్ కౌన్టీ నియోజకవర్గాన్ని చేర్చకుండా భూభాగం మాత్రమే 342.5 చదరపు మైళ్ళు విస్తరించి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ననుసరించి నగర జనాభా 2007 జూన్ 22 తారీఖుకు 1,232,940.
డల్లాస్ నగరం | |||
|
|||
ముద్దు పేరు: Big D,D-Town,Triple D | |||
నినాదం: Live Large. Think Big. | |||
డల్లాస్ కౌంటీలో , టెక్సాస్ రాష్ట్రములో స్థానం | |||
అక్షాంశరేఖాంశాలు: 32°46′58″N 96°48′14″W | |||
---|---|---|---|
దేశము | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | ||
రాష్ట్రము | టెక్సాస్ | ||
కౌంటీలు | డల్లాస్ కాలిన్ డెంటన్ రాక్ వాల్ కౌఫ్ మాన్ | ||
స్థాపించబడినది | 2 February 1856 | ||
ప్రభుత్వం | |||
- Type | Council-manager | ||
- మేయరు | Tom Leppert | ||
వైశాల్యము | |||
- City | 997.1 km² (385.0 sq mi) | ||
- భూమి | 887.2 km² (342.5 sq mi) | ||
- నీరు | 110.0 km² (42.5 sq mi) | ||
ఎత్తు | 131 m (430 ft) | ||
జనాభా (2007) | |||
- City | 1,232,940 (9th largest) | ||
- సాంద్రత | 1,391.9/km2 (3,605.08/sq mi) | ||
- మెట్రో | 6,145,037 (4th largest) | ||
- Demonym | Dallasites | ||
కాలాంశం | Central (UTC-6) | ||
- Summer (DST) | Central (UTC-5) | ||
Area code(s) | 214, 469, 972 | ||
FIPS code | 48-19000[1] | ||
GNIS feature ID | 1380944[2]
|
||
ప్రధాన విమానాశ్రయము | Dallas-Fort Worth International Airport- DFW (Major/International) | ||
రెండవ విమానాశ్రయం | Dallas Love Field- DAL (Major) | ||
వెబ్సైటు: dallascityhall.com |
డల్లాస్ నగరం 12 కౌంటీలు కలిగిన డల్లాస్-ఫోర్ట్‌వర్త్ మహానగర ఆర్థిక కేంద్రం. ఈ రెండు ప్రాంతాలను కలిపి ప్రజలు ది మెట్రో కాంప్లెక్స్' 'అని అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. డల్లాస్ మహానగరపాలిత ప్రాంతం 66 లక్షల జనాభాతో అమెరికాలో మహానరపాలిత ప్రాంతాలలో 4వ స్థానంలో ఉంది.
అంతర్జాతీయంగా ఉన్న నగరాల గురించి అధ్యయనంలో లగ్ బరో' 'విశ్వవిద్యాలయంచే ఈ నగరం నైరుతి ప్రాంత అమెరికాలో ఏకైకవిశ్వ నగరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
డల్లాస్ నగరం 1841లో స్థాపించబడింది. 1856లో నగర హోదాను పొంది నగరపాలిత ప్రాంతం అయింది. నగరం ప్రధానంగా బ్యాంకింగ్, వ్యాపారం, సమాచార రంగం, విద్యుత్శ్చక్తి, కంఫ్యూటర్ విజ్ఞానం, రవాణా రంగాలపై ఆధార పడి ఉంది. డల్లాస్ భూమధ్యస్థంగా ఉంది కనుక ఇక్కడ నుండి జలమార్గాలు, సముద్రంతో సంబంధ బాందవ్యాలు తక్కువే. చమురు పరిశ్రమలకు, పత్తి పంటలకు డల్లాస్‌కు ప్రత్యేకత ఉంది. విస్తారంగా ఉన్న రైల్, రోడ్డు వసతుల కారణంగా ఇది బలవత్తరమైన రవాణా, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రం అయింది.