టాంజానియా
From Wikipedia, the free encyclopedia
టాంజానియా[3][4][note 1] అధికారంగా యునైటెడు రిపబ్లికు ఆఫ్ టాంజానియా అని పిలువబడుతుంది. (ఆంగ్లం : The United Republic of Tanzania[5] తూర్పు ఆఫ్రికా లోని ఒక సార్వభౌమ రాజ్యం. ఇది గ్రేటు లేక్ ప్రాంతంలో ఉంది. దేశ ఈశాన్యసరిహద్దులో కెన్యా ఉంది. తూర్పులో హిందూమహాసముద్రం లోని కొమరో ద్వీపాలు ఉన్నాయి. ఉత్తరసరిహద్దులో ఉగాండా ఉంది. పశ్చిమసరిహద్దులో రువాండా, బురుండీ, కాంగో ఉన్నాయి. దక్షిణసరిహద్దులో జాంబియా, మలావి ఉన్నాయి. ఆగ్నేయసరిహద్దులో మొజాంబిక్ ఉంది. తూర్పు సరిహద్దులో హిందూ మహాసముద్రం ఉంది. టంజానియా ఈశాన్యప్రాంతంలో ఉన్న కిళిమంజారో పర్వతప్రాంతం ఆఫ్రికా అత్యున్నత ప్రాంతంగా గుర్తించబడుతుంది.
జమ్‌హూరియా మూంగానో వ తాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "ఉహురూ నా ఉమోజా" (Swahili) "స్వేచ్ఛా, సమానత్వం" |
||||||
జాతీయగీతం ముంగూ ఇబారికి ఆఫ్రికా "దేవుడు ఆఫ్రికాను దీవించుగాక (God Bless Africa)" |
||||||
రాజధాని | డొడోమా | |||||
అతి పెద్ద నగరం | దార్ ఉస్ సలాం | |||||
అధికార భాషలు | స్వాహిలి (de facto) ఆంగ్లం (Higher courts, higher education)[1] |
|||||
ప్రజానామము | టాంజానియన్ | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | Jakaya Mrisho Kikwete | ||||
- | ప్రధానమంత్రి | Mizengo Pinda | ||||
స్వాతంత్ర్యం | యునైటెడ్ కింగ్ డం నుండి | |||||
- | Tanganyika | December 9, 1961 | ||||
- | Zanzibar | January 12, 1964 | ||||
- | Merger | April 26, 1964 | ||||
- | జలాలు (%) | 6.2 | ||||
జనాభా | ||||||
- | నవంబరు 2006 అంచనా | 40,000,000 (32వది) | ||||
- | 2005 జన గణన | 37,445,392 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $48.921 బిలియన్లు[2] | ||||
- | తలసరి | $1,255[2] | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $16.691 billion[2] | ||||
- | తలసరి | $428[2] | ||||
జినీ? (2000–01) | 34.6 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | 0.503 (medium) (153వది) | |||||
కరెన్సీ | Tanzanian shilling (TZS ) |
|||||
కాలాంశం | EAT (UTC+3) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .tz | |||||
కాలింగ్ కోడ్ | ++2552 | |||||
1 Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected. ² 007 from Kenya and Uganda. |
6 మిలియన్ల సంవత్సరాల క్రితం టాంజానియాలో ప్లయోసీన్ అని పిలిచే మొట్టమొదటి మానవులు నివసించారని భావిస్తున్నారు. ఆస్త్రోపతిహేకసు జాతి ఆఫ్రికా అంతటా 4-2 మిలియన్ల సంవత్సరాల క్రితం నివసించారు. హోమో జాతికి చెందిన ప్రాచీన అవశేషాలు ఓల్డ్వాయి సరోవరం సమీపంలో కనిపిస్తాయి. 1.8 మిలియన్ల సంవత్సరాల క్రితం హోమో ఎరేక్టసు పెరుగుదల తరువాత మానవజాతి పురాతన ప్రపంచం అంతటా వ్యాపించిన తరువాత హోమో సేపియన్లు పేరుతో ఆస్ట్రేలియాకు వ్యాపించాయి. హోమో సేపియన్లు ఆఫ్రికామీద కూడా ఆధిక్య సాధించాయి. వీరు పురాతన జాతులు, ఉపజాతులను విలీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఉనికిలో ఉన్న పురాతన జాతి సమూహాలలో ఒకటైన హడ్జజా టాంజానియాలో ఉద్భవించిందని భావిస్తున్నారు. వారి మౌఖిక చరిత్ర పూర్వం ఉన్న పూర్వీకులను గుర్తుచేస్తుంది. వారు అగ్ని, ఔషధం ఉపయోగిస్తూ, గుహలలో నివసించిన మొదటి మానవులని భావిస్తున్నారు. హోమో ఎరేక్టసు, హోమో హేడిల్బెర్గేన్సిసు లని పిలువబడిన ఈ ప్రజలు ఇదే ప్రాంతంలో నివసించారని భావిస్తున్నారు.
టాంజానియాలో రాతియుగం, కాంస్య యుగంలో ప్రస్తుత దక్షిణ ఇథియోపియా నుండి దక్షిణానికి వచ్చిన దక్షిణ కుషిటికు మాట్లాడే ప్రజల చారిత్రపూర్వ వలసలు సంభవించాయి.[6] 2,000 - 4,000 సంవత్సరాల క్రితం టాంజానియాలో తుర్కనా సరసుకు ఉత్తరాన ఉన్న తూర్పు కుషిటిక్ ప్రజలు;[6] 2,900 - 2,400 సంవత్సరాల క్రితం మధ్య ప్రస్తుత దక్షిణ సుడాన్-ఇథియోపియా సరిహద్దు ప్రాంతము నుండి వచ్చిన డాటోగు ప్రజలతోతో సహా దక్షిణ నిలోట్సు ఈ ప్రాంతానికి చేరుకున్నారు.[6] పశ్చిమాఫ్రికా లోని తంగన్యికా సరోవరం, విక్టోరియా సరోవరం ప్రాంతాలలో బంటుప్రజలు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు. తర్వాత వారు 2,300 - 1,700 సంవత్సరాల క్రితం టాంజానియా మిగిలిన ప్రాంతాలకు వలస వచ్చారు. [6][7]
19 వ శతాబ్దం చివరిలో " జర్మనీ తూర్పు ఆఫ్రికా " స్థాపించబడడంతో టంజానియా ప్రధాన భూభాగంలో ఐరోపా వలసవాదం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇది బ్రిటీషు పాలనకు దారితీసింది. ప్రధాన భూభాగం టాంగ్యానికాగా పరిపాలించబడింది. జాంజిబారు ద్వీపసమూహం ప్రత్యేక న్యాయపరిధిలో ఉంది. 1961 - 1963 లలో అవి స్వతంత్రత పొందిన తరువాత రెండు ప్రాంతాలు 1964 ఏప్రెలులో విలీనమై " యునైటెడు రిపబ్లికు ఆఫ్ తంజానియా " రూపొందించాయి.[8]
2016 లో టంజానియా జనసంఖ్య 55.57 మిలియన్లకు చేరుకున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.[9] ప్రజలలో అనేక జాతి, భాషా, మత సమూహాలున్నాయి. టాంజానియా సార్వభౌమ రాజ్యం. ఇది రాష్ట్రపతి రాజ్యాంగ రిపబ్లిక్కు. 1996 నుండి డోడోమా దాని అధికారిక రాజధాని నగరంగా ఉంది. ఇక్కడ రాష్ట్రపతి కార్యాలయం, జాతీయ అసెంబ్లీ, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.[10] మాజీ రాజధాని అయిన దార్ ఎస్ సలాంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇది దేశంలోని అతి పెద్ద నగరంగా ప్రధాన నౌకాశ్రయం, ప్రముఖ వ్యాపార కేంద్రంగా గుర్తించబడుతుంది.[8][11][12] టాంజానియా ఏకపార్టీ దేశం. ప్రజాస్వామ్య సామ్యవాద పార్టీ అయిన " చమా చ మపిండుజి " పార్టీ అధికారంలో ఉంది.
టాంజానియా ఈశాన్యంలో పర్వతాలు, దట్టమైన అడవులను కలిగి ఉంది. ఇక్కడ కిలిమంజారో పర్వతం ఉంది. ఆఫ్రికా గ్రేటు లేక్సు మూడు భాగాలు టంజానియాలో భాగంగా ఉంది. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో విక్టోరియా సరసు (ఆఫ్రికా, అతి పెద్ద సరస్సు) ఉంది. అదనంగా టాంకన్యిక సరస్సు ( ఆఫ్రికాఖండంలో లోతైన సరస్సు, ఇది చేపల కోసం ప్రసిద్ధి చెందింది) ఉంది. దక్షిణప్రాంతంలో మాలావి సరసు ఉంది. తూర్పు తీరం వేడి, తేమతో కూడి ఉంటుంది. జాంజిబారు ద్వీపసమూహం సముద్రంలో ఉంది. మెనాయి బే కన్జర్వేషను ఏరియా జాంజిబారు అతిపెద్ద సముద్ర రక్షిత ప్రాంతంగా ఉంది. జాంబియా సరిహద్దు వద్ద కలాంబో నదిపై ఉన్న కలాంబో జలపాతాలు ఆఫ్రికాలో రెండవ అత్యధిక ఎడతెగని జలప్రవాహం కలిగిన జలపాతంగా ప్రత్యేకత కలిగి ఉంది.[13]
టాంజానియాలో 100 కన్నా ఎక్కువ భాషలు వాడుకలో ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో ఇది చాలా భాషా వైవిధ్యం కలిగిన దేశంగా ఉంది.[14] దేశంలో అధికారిక భాష లేదు. [ఆధారం చూపాలి] అయితే జాతీయ భాషగ స్వాహిలీ ఉంది.[15] స్వాహిలీ భాషను సుప్రీం పార్లమెంటరీ చర్చలో, దిగువ కోర్టులలో, ప్రాథమిక పాఠశాలలో బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు. ఇంగ్లీషును విదేశీ వాణిజ్యం, దౌత్యత్వంలో, ఉన్నత న్యాయస్థానాలలో, ద్వితీయ, ఉన్నత విద్యలో బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు.[14] అయితే టాంజానియా ప్రభుత్వం ఇంగ్లీష్‌ను పూర్తిగా అభ్యసించే భాషగా నిలిపివేయాలని యోచిస్తోంది.[16] సుమారుగా 10 % మంది టాంజానియావారు మొదటి భాషగా స్వాహిలి వాడుకభాషగా ఉంది. 90% వరకు రెండవ భాషగా మాట్లాడతారు.[14]