జావా సముద్రం
సముద్రం / From Wikipedia, the free encyclopedia
జావా సముద్రం( ఇండోనేషియన్: లౌత్ జావా) సుండా షెల్ఫ్‌లో విస్తరించి ఉన్న ఒక నిస్సార సముద్రం. దీనికి ఉత్తరాన బోర్నియో, దక్షిణాన జావా, పశ్చిమాన సుమత్రా, తూర్పున సులవేసి ద్వీపాలు ఉన్నాయి[1][2]. వాయువ్య భాగంలో కరిమాత జలసంధి ద్వారా దక్షిణ చైనా సముద్రానికి అనుసంధానించబడి ఉంది. ఈ సముద్రంలో 3 వేలకు పైగా సముద్ర జీవ జాతులు ఉన్నాయి. జావా సముద్రంలో చేపలు పట్టడం ఒక ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం. జావా సముద్రంలో ప్రవాహం రుతుపవనాలచే నిర్ణయించబడుతుంది. తూర్పు రుతుపవనాలు నీటి ప్రవాహాన్ని ఫ్లోర్స్ సముద్రం నుండి జావా సముద్రం వరకు తీసుకువెళతాయి. పశ్చిమ రుతుపవనాలు నీటి ప్రవాహాన్ని దక్షిణ చైనా సముద్రం నుండి కరిమాత జలసంధి ద్వారా సముద్రంలోకి నీటిని తీసుకువెళతాయి.
త్వరిత వాస్తవాలు జావా సముద్రం, ప్రదేశం ...
జావా సముద్రం | |
---|---|
ప్రదేశం | సుండా షెల్ఫ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 5°S 110°E |
రకం | సముద్రం |
బేసిన్ దేశాలు | ఇండోనేషియా |
గరిష్ట పొడవు | 1,600 km (990 mi) |
గరిష్ట వెడల్పు | 380 km (240 mi) |
320,000 km2 (120,000 sq mi) | |
సగటు లోతు | 46 m (151 ft) |
నివాస ప్రాంతాలు | సిలెగాన్, సిరెబాన్, జకార్తా, మకస్సర్, పెకలోంగన్, సెమరాంగ్, తీగల్ |
మూసివేయి